బిజినెస్

సౌదీపైనే ఆశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న, బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆటు స్టాక్ మార్కెట్‌ను, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర కొన్ని సందర్భాల్లో తప్ప, క్రమం తప్పకుండా పెరుగుతునే ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సౌదీ అరేబియా సాయం చేస్తుందని కేంద్రం ఆశిస్తోంది. పెట్రో ధరలు నిలకడగా ఉంటేనే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తుందనేది వాస్తవం. స్టాక్ మార్కెట్ లావాదేవీలు, లాభాలు లేదా నష్టాలే దేశ ఆర్థిక స్థితిగతులకు అద్దం పడతాయి. అంతేగాక, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే, వాటి ప్రభావం అన్ని వస్తుసేవలపైనా పడుతుంది. ధరలకు రెక్కలొస్తాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ద్రవ్య లబ్దత అంతంత మాత్రంగానే ఉండగా, దానికితోడు పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ అంశాలు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయన్నది నరేంద్ర మోదీ సర్కారుకు తెలియంది కాదు. అందుకే, మిగతా అంశాలు ఎలావున్నా, ముందుగా పెట్రో ధరలను నియంత్రీకరించేందుకు సన్నాహాలు మొదలు పెడుతున్నది. ప్రపంచంలోనే ముడి చమురు ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా సాయంతో, ధరల నియంత్రీకరణ సాధ్యమవుతుందన్న ఆలోచనతో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారు. సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్‌ఫలీ గత మూడు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు భారత్‌కు రావడం, ఇక్కడ ధరేంద్ర ప్రధాన్‌తో చర్చలు జరపడం కేంద్ర వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నది. అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వేగం తగ్గింది. మరోవైపు ధరలను నిలకడగా ఉంచేందుకు పెట్రో ఉత్పత్తులను తగ్గింలని రష్యా తదితర దేశాలు నిర్ణయించాయి. పెట్రోలు ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య ‘ఒపెక్’ పెట్రో ధరలు తగ్గకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురును కొనడానికి భారీ మొత్తాలను చెల్లించాల్సి వస్తున్నది. ఫలితంగా కేంద్రం పదేపదే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాల్సి వస్తున్నది. గత నెల లీటర్ పెట్రోలుపై రెండు రూపాయలు పెంచడం సహజంగానే ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ధర తగ్గించడం తమ చేతుల్లో లేదు కాబట్టి, చమురు దిగుమతి చేసే దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా ఎంతోకొంత మేలు పొందాలని కేంద్రం ఆలోచిస్తున్నది. చమురు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉన్న సౌదీ అరేబియా సానుకూలంగా స్పందిస్తుందని, బ్యారెల్ ముడి చమురు రేటు తగ్గిస్తుందని ఆశిస్తున్నది. నిజానికి ఇంతకు మించిన మరో ప్రత్యామ్నాయం కేంద్రం వద్ద లేదన్నది నిజం. అందుకే, ప్రధాని మోదీ ప్రత్యేకించి సౌదీ అరేబియాలో పర్యటించారు. అక్కడి యువరాజు భారత్‌కు వచ్చారు. చమురు శాఖ మంత్రి అల్‌ఫలీతో భారత చమురు మంత్రి ప్రధాన్ రెండు పర్యాయాలు సమావేశమై, చర్చించినట్టు సమాచారం. మొత్తం మీద పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడానికి మోదీ సర్కారు ఎక్కువగా సౌదీ అరేబియాపైనే ఆధారపడింది. ఎన్నికల వేళ ఈ ధరలు పెరగకుండా ఉంటే మేలన్న ఉద్దేశంతో, సౌదీని మచ్చిక చేసుకుంటున్నది. ఈ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో? ఏ స్థాయిలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయో చూడాలి. ఎన్నికల్లో కేంద్రానికి సౌదీ నిర్ణయాలు ఎంత వరకూ సానుకూలంగా ఉంటా యన్నది ఉత్కంఠ రేపుతున్నది.