బిజినెస్

అమెరికా ముందు పెను సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 23: అమెరికా ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటున్నది. చట్టసభకు, దేశాధ్యక్షుడికి మధ్య సయోధ్య సక్రమంగా లేకపోవడంతో, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఎన్నో అంశాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. అధికార రిపబ్లిక్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ అడ్డుకుంటున్నది. మెక్సికో సరిహద్దుల నుంచి లెక్కకు మించి శరణార్థులు అమెరికాలో చొరబడుతున్నారని, వీరి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రంప్ వాదన. అందుకే, మెక్సికో, అమెరికా మధ్య భారీ గోడను కట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, మానవ హక్కుల పేరుతో డెమోక్రాటిక్ పార్టీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. కీలకమైన చివరికి బడ్జెట్‌లోని కొన్ని అంశాలకు మాత్రమే ఆమోద ముద్ర వేసింది. చాలా వరకు కీలకాంశాలకు చట్టసభ కాంగ్రెస్ మద్దతు లభించకపోవడంతో, ‘షట్‌డౌన్’ సమస్య తలెత్తింది. ఒకవైపు చైనాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే వచ్చి పడిన షట్‌డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై చైనా భారీగా పన్నులు వేస్తున్నదని, తాము మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఎక్కువ శాతం వస్తువులకు అసలు పన్నులే వసూలు చేయడం లేదని ట్రంప్ అంటున్నారు. ఎన్ని పర్యాయాలు దీనిని చైనా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఫలితం లేకపోవడంతో తీవ్రంగా స్పందించారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పన్నులను భారీగా పెంచేశారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మొదలైన ఆర్థిక యుద్ధం ఇంకా కొనసాగుతునే ఉంది. అధికారుల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇరు దేశాల అధ్యక్షులే పూనుకొని, ముఖాముఖి చర్చలు జరిపితే తప్ప సమస్యకు తెరపడే అవకాశం లేదు. ఈ సమస్య రావణ కాష్టంలా మండుతునే ఉంటే, మరోవైపు భారత్‌పైన కూడా అమెరికా కనె్నర్ర చేస్తున్నది. చైనా మాదిరిగానే భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై రెండు నుంచి మూడు వందల శాతం పన్ను విధిస్తున్నదని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ఎక్కువ శాతం డ్యూటీ ఫ్రీ జాబితాలోనే ఉన్నాయని ట్రంప్ గుర్తుచేస్తున్నారు. దిగుమతి పన్నుల విధానాలు మార్చుకోవాలని భారత్‌కు సూచించిన ట్రంప్, చర్చలకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. కానీ, భారత్ మాత్రం అంతర్జాతీయ దిగుమతుల విధివిధానాలను అనుసరించే పన్నులు వసూలు చేస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం మీద చైనా మాదిరిగానే, భారత్‌తోనూ అమెరికా వాణిజ్య యుద్ధానికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. సహజంగానే ఈ పరిస్థితు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎంతోకొంత దెబ్బతీయడం ఖాయం. చైనా, భారత్‌తో వాణిజ్య పరమైన అంశాలు, ప్రత్యేకించి పన్నుల విధానాలపై తీవ్రంగా విభేదిస్తున్న అమెరికాలో ఆర్థిక మాంద్య పరిస్థితులు క్రమంగా నెలకొంటున్నాయని నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి దేశాధ్యక్షుడు ట్రంప్ తనకు అవసరమైన మద్దతును కూడగట్టుకోలేక పోతున్నారు. ఇలావుంటే, వడ్డీ రేట్లు ఫెడ్ రిజర్వ్ ఇప్ప ట్లో పెంచే అవకాశం కనిపించడం లేదు. బాకీలను వసూలు చేయాలంటే, వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలని, లేకపోతే, రా నిబాకీల మొత్తాలు రోజురోజుకూ పెరుగుతునే ఉంటాయని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే కొన్ని అంశాల్లో నిరసనలు ఎదుర్కొంటున్న ట్రంప్ మరిన్ని సమస్యలను కొనితెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే, ఆయన కూడా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచేందుకు సుముఖంగా లేరని సమాచారం. అన్ని రకాలుగా ఖర్చులు భారీ గా పెరుగుతున్న నేపథ్యంలో, వడ్డీ రేట్లను పెంచకపో తే, బ్యాంకులకు భారీ నష్టాలు తప్పవు. ఒకవేళ వడ్డీ రేటు పెం చితే, రాని బాకీల ఖాతాలో కోట్లకు కోట్ల డాలర్లు కనిపిస్తా యి. దీనితో ఎటూ తేల్చుకోలేకపోతున్న ట్రంప్, ప్రస్తుతానికి వడ్డీ రేట్లను పెంచవద్దని ఫెడ్ రిజర్వ్‌కు సూచించారని అంటున్నారు. నిజానిజాలు ఎలావున్నా, ఈ ఏడాది వడ్డీ రేట్ల ను పెంచేందుకు ఫెడ్ రిజర్వ్ సిద్ధంగా లేదన్న వార్త బలంగా వినిపిస్తున్నది. డెమోక్రాట్ల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, చైనాతో వాణిజ్య యుద్ధం, భారత్‌తో తీవ్ర స్థాక్షిలో విభేదాలు, ఫెడ్ రిజర్వ్ రెపో రేటును సవరించక పోవడం వంటి సమస్యల్లో చిక్కుకొని అమెరికా ఆర్థిక వ్యవస్థ తల్లడిల్లుతున్నది. అక్కడి ఆర్థిక వ్యవస్థలో ఏ చిన్న మార్పు చోటు చేసుకున్నా, దాని ప్రభావం యావత్ ప్రపంచంపై ఉంటుం ది. భారత్‌కు దీని తాకిడి మరింత ఎక్కువ. అమెరికా సమస్యల కారణంగా భారత్ కూడా నష్టాల ఊబిలోకి దిగబడిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ సమస్యను నివారణకు కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.