బిజినెస్

శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ అరైవల్స్ టెర్మినల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. దేశీయ ప్రయాణీకుల సౌకర్యం కోసం ‘డొమిస్టిక్ అరైవల్స్ టెర్మినల్’ను శనివారం నాటి నుంచి అందుబాటులోకి తెచ్చారు. మొదటిసారి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎస్‌జీ 468 విమాన ప్రయాణీకులు కొత్త సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. సుమారు 4000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎయిర్ సైడ్‌లో ప్రస్తుత ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌కు తూర్పు భాగంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు దీన్ని ఏర్పాటు చేశారు. ఐడీఏటీ ప్రధానంగా రిమోట్ స్టాండ్లలో పార్కు చేసిన విమానాల ద్వారా వచ్చిన ప్రయాణీకుల అవసరాలను తీర్చనుంది. టెర్మినల్‌లో 45 మీటర్ల పొడవున్న నాలుగు కొత్త బ్యాగేజ్ క్యారేజల్ బెల్టులు ఉన్నాయి. దీని వల్ల బ్యాగేజీ డెలివరీ మరింత వేగవంతం అవుతుంది. శంషాబాద్ వినాశ్రయానికి రోజూ సుమారు 30 వేల మంది దేశీయ ప్రయాణీకులు వస్తున్నారు. ప్రయాణికుల్లో 50 శాతం బ్యాగేజీ అవసరాలు తీరనున్నాయి. ఐడీఏటీ ప్రారంభంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మొత్తం బ్యాగేజీ బెల్టుల సంఖ్య ఏడుకు చేరింది. కొత్త టెర్మినల్ వ్యవస్థ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ఉపయోగకరం. గేయిల్ సీఈఓ ఎస్‌జీకే కిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ విమానాశ్రం నుంచి ప్రతియేటా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికుల సేవల్లోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
చిత్రం..అధునాతన వ్యవస్థతో ఏర్పాటు చేసిన దేశీయ టెర్మినల్‌లో మొదటిసారి తిరుపతి నుంచి
హైదరాబాద్‌కు వచ్చిన విమాన ప్రయాణికులు తమ లగేజీని తీసుకుంటున్న దృశం