బిజినెస్

హేట్సాప్ ఎయిర్ ఇండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: విధి నిర్వహణలో నిజాయితీ ప్రదర్శించిన ఉద్యోగికి పదోన్నతి కల్పించి ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా హేట్సాప్ అనిపించుకుంది. ఎయిర్ ఇండియా చరిత్రలో ఈ తరహా ప్రమోషన్ ఇవ్వడం ఇదే మొదటిసారవగా, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెక్యురిటీ విభాగంలో పనిచేస్తున్న సుభాష్ చందర్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. సుభాష్‌ను ర్యాంక్ ఆఫీసర్‌గా ప్రమోట్ చేస్తూ ఎయిర్ ఇండియా చైర్మన్, ఎండి అశ్వనీ లొహానీ ఆదేశాలు జారీ చేసినట్టు ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. సోమవారం ఆయనకు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సెక్యురిటీ) అలోక్ సింగ్ పదోన్నతి పత్రాలు ప్రదానం చేశారు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన చందర్ ఏవియేషన్ సెక్యురిటీకి సంబంధించి పలు కోర్సులు చేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయడమే కాకుండా నిజాయితీగా ఉండేవారు. విమానంలో ప్రయాణికులు పోగొట్టుకున్న విలువైన వస్తువులు, నగదును భద్రంగా వారికి అందజేసేవారు. ఇటీవల హాంకాంగ్ నుంచి వచ్చిన విమానంలో ఐదు లక్షల రూపాయల విదేశీ కరెన్సీ దొరికితే సదరు ప్రయాణికుడి చందర్ అందించారు. 2003 ఆగస్టు 25న భోపాల్ నుంచి సౌదీ అరేబియా వెళ్లే విమానంలో కూడా ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న ఆభరణాలు భద్రంగా అందచేసిన చందర్ ఎయిర్ ఇండియాలో 29 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు.