బిజినెస్

జెఎస్‌డబ్ల్యు ప్రక్జైర్‌లో జెఎస్‌డబ్ల్యు స్టీల్‌కు భారీ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు స్టీల్.. జెఎస్‌డబ్ల్యు ప్రక్జైర్ ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (జెపిఒపిఎల్)లో మెజారిటీ వాటాను దక్కించుకుంటోంది. 74 శాతం వాటాను 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు మంగళవారం జెఎస్‌డబ్ల్యు స్టీల్ తెలియజేసింది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కూడా జరిగింది. కాగా, పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఆక్సిజన్‌తోపాటు నైట్రోజన్, ఆర్గాన్ వంటి వాయువులను జెపిఒపిఎల్ ఉత్పత్తి చేస్తుంది. కర్నాటకలోని బళ్ళారి జిల్లాలో ఇందుకు సంబంధించి రెండు ప్లాంట్లుండగా, వీటి ఉత్పాదక సామర్థ్యం రోజుకు 2,500 టన్నులు.