బిజినెస్

టియాగో ధరను పెంచిన టాటా మోటార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. తమ టియాగో కారు ధరను పెంచింది. వివిధ మోడళ్ల ఆధారంగా కనిష్టంగా 5,000 రూపాయల నుంచి గరిష్ఠంగా 60,000 రూపాయల వరకు ధరలు పెరిగాయి. ఏప్రిల్‌లో విడుదలైన ఈ కారు ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం 3.2 లక్షల రూపాయల నుంచి 5.6 లక్షల రూపాయల మధ్య ఉంది. కాగా, మారుతి సుజుకి, హ్యుందాయ్ సంస్థలు తమ కార్ల ధరలను ఇటీవల పెంచిన నేపథ్యంలో టాటా మోటార్స్ కూడా అదే బాటలో నడిచింది. నిజానికి టియాగో పేరును మొదట్లో ‘జికా’గా నిర్ణయించినప్పటికీ ఆ పేరుతో ప్రాణాంతక వ్యాధి ఉండటం వల్ల దాన్ని టియాగోగా మార్చింది.