బిజినెస్

ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ మాజీ ఎండీ రమేష్‌బావా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: వరుస నిర్వహణ లోపాలతో, అవకతవకలతో తీవ్రంగా నష్టపోయి భారత ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కుదిపేసిన ఇన్‌ప్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) లిమిటెడ్ వ్యవహారంలో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్‌బావా ఆదివారం అరెస్టు అయ్యారు. ఈ సంస్థ చైర్మన్ హరిశంకరన్ అరెస్టయిన రెండు వారాల తర్వాత రమేష్‌బావా అరెస్టవడం గమనార్హం. కాగా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అక్రమాలను నిగ్గుదేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా కృషి చేస్తోంది. మొత్తం రూ.91వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో ఆర్థిక సేవల విభాగం మాజీ సీఈవోగా పనిచేసిన రమేష్‌బావాకు అరెస్టు కాకుండా రక్షణ కల్పించేందుకు సుప్రీం శుక్రవారం నిరాకరించడంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ సీరియస్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఆయన్ని అరెస్టు చేసిందని అ ధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని నాన్ బ్యాం కింగ్ ఆర్థిక సేవల రంగంలోని డొల్లతనాన్ని బహిర్గ తం చేసిన ఈ వ్యవహారంతో బావా తన ఎండీ, సీ ఈవో పోస్టుకు గత సెప్టెంబర్‌లో రాజీనామా చేశారు.