బిజినెస్

విలువ ఆధారిత నష్టాల్లో ఆరు అగ్ర కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మార్కెట్‌లో అతివిలువైన తొలి పది భారతీయ కంపెనీల్లో ఆరు కంపెనీలు గతవారం గణనీయంగా తమ మార్కెట్ వి లువను కోల్పోయాయి. ఈ కంపెనీలు మొత్తం రూ.42,827.39 కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోగా ఇందులో ఐటీ దిగ్గజం టీసీఎస్ భా రీగా నష్టపోయిన సంస్థగా మిగిలింది. కాగా తొలిపది అతివిలువైన కంపెనీల్లో ఐటీసీ, హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాం కు మార్కెట్లో బలపడి మార్కెట్ కేపిటలైజేషన్ (ఎమ్-కాప్)లో మరింతగా విలువను సంతరించుకున్నాయి. అలాగే గడచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దాదాపు రూ.14,146.5 కోట్ల నష్టంతో రూ. 7.55.636.47 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 9.967.3 కోట్ల విలువను కోల్పోయి రూ.6,16,869.80 కోట్ల కు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.8,327.77 కోట్లు విలువను కోల్పోయి రూ. 8,50.628.63 కో ట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.5,198.74 కోట్లు కోల్పో యి రూ.3,48,806.25 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.3,669.9 కోట్ల విలువను కోల్పోయి మొత్తం విలువ రూ. 3,26,730.54 కోట్లకు పడిపోయింది. అలాగే ఎస్‌బీఐ విలువ సైతం రూ. 1,517.19 కోట్ల తగ్గిపోయి మొత్తం విలువ రూ. 2,81,393 కోట్లకు దిగివచ్చింది. మరోవైపు ఐటీసీ మార్కెట్ కేపిటలైజేషన్ (ఎమ్‌కాప్) రూ. 13,423.2 కోట్లు పెరిగి మొ త్తం విలువ రూ. 3,74,623.78 కోట్లకు పెరిగింది. ఇక హెచ్‌యూఎల్ విలువ రూ.13,237.17 కోట్లు పెరిగి మొత్తం రూ. 3,72,513 కోట్లకు చేరింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు విలువ రూ. 2,039.41 కోట్లు పెరిగి మొత్తం రూ. 2,54,278.86 కోట్లకు చే రగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సైతం అదనంగా రూ. 2,039.41 కోట్లు బలపడి మొత్తం విలువ రూ.2,56,822.96 కోట్లకు చేరింది. ఇలావుండగా గత వారం అతి విలువైన టాప్‌టెన్ కంపనీల ర్యాంకింగ్స్‌లో ఆర్‌ఐఎల్ అగ్రభాగాన నిలిచింది. తర్వాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు నిలిచాయి. కాగా బీఎస్‌ఈలో సెనె్సక్స్ గతవారం రోజుల్లో 95.12 పాయింట్లు నష్టపోగా చివరి రోజైన శుక్రవారం 38,767.11 పాయింట్ల వద్ద ఆ సూచీ స్థిరపడిన సంగతి తెలిసిందే.