బిజినెస్

గోదావరి జిల్లాల్లో పెరిగిన వర్జీనియా సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది వర్జీనియా సాగు విస్తీర్ణం పెరిగింది. పొగాకు కొనుగోలుకు వేలం ప్రక్రియ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులోని కేంద్ర పొగాకు వేలం కేంద్రంలో సోమవారం వేలం ప్రక్రియ మొదలైంది. ఈ ఏడాది మొత్తం 1373 మంది రైతులు 1464 బ్యారన్లలో 1757 హెక్టార్లలో 3.8 మిలియన్ కిలో ఉత్పత్తికి కేంద్ర పొగాకు బోర్డు నుంచి అనుమతి తీసుకున్నారు. గత ఏడాది 1339 హెక్టార్లలో సాగుచేయగా ఈ ఏడాది 1496 హెక్టార్లలో సాగు జరిగింది. అంటే 157 హెక్టార్ల మేరకు అధికంగా సాగుజరిగింది. గత ఏడాది కిలో పొగాకు సరాసరి ధర రూ.124ల 41, అత్యధిక ధర రూ.166 పలికింది. ఈ ఏడాది ప్రారంభ అత్యధిక ధర రూ.165తో వేలం మొదలుకావడం శుభసూచకంగా రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది 1373 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నప్పటికీ 1157 మంది రైతులు మాత్రమే పంట సాగుచేశారు. 1238 బ్యారన్లలో 1457 హెక్టార్లలో సాగుచేశారు. ఈ నేపథ్యంలో 2.8 మిలియన్ కిలోల దిగుబడి రావచ్చని అంచనావేశారు. గత ఏడాది మొత్తం 106 రోజుల పాటు వేలం ప్రక్రియ నిర్వహించారు. 2.84 మిలియన్ కిలోల వర్జీనియా పొగాకు అమ్మకం జరిగింది.
తొర్రేడులోని కేంద్ర పొగాకు బోర్డు వేలం కేంద్రం అధికారి వై సుబ్రహ్మణ్యం సోమవారం రైతులు తెచ్చిన పొగాకు బేళ్ళకు వేలం నిర్వహించడం ప్రారంభించారు. మొదటి రోజు మొత్తం 18 పొగాకు బేళ్ళను వేలానికి పెట్టగా అందులో 16 బేళ్ళు అమ్ముడుపోయాయి. రెండు బేళ్ళను బయ్యర్లు తిరస్కరించారు. 2049.4 కిలోల వర్జీనియా అమ్మకం జరిగింది. మొదటి రోజు సరాసరి ధర రూ.160.44 లభించగా అత్యధిక ధర రూ.165, అత్యల్ప ధర రూ.144 పలికింది. మొదటి రోజు వేలానికి ఐటీసీ, పీటీపీ నుంచి ఏడుగురు బయ్యర్లు హాజరయ్యారు. గత ఏడాది కంటే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని రైతులు ఈ ఏడాది అధిక దిగుబడి సాధించడానికి కృషిచేస్తున్నారు. అయితే ఒకసారి పెథాయ్ తుపాను కారణంగా పొగాకు నారుమడులు గోదావరి జిల్లాల్లో దెబ్బతినడంతో రెండోసారి రైతులు పొగాకు నారుమడులు వేసి సాగుచేశారు. ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉంటే మరింత విస్తీర్ణం పెరిగేందుకు అవకాశంవుందని రైతులు ఆశిస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాది నుంచి ఈపేమెంట్స్ విధానం కూడా అమల్లోకి రావడంతో రైతులకు పేమెంట్లలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో బ్యాంకులో చేసిన అప్పులు తీరి కాస్తంత త్వరితగతిన ఒడ్డునపడటానికి అవకాశంవుంటుందని ఆశపెడుతున్నారు. కాకపోతే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గత ఏడాది కంటే కాస్తంత నాణ్యత లోపించవచ్చని అంచనావేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పొగాకు కూలీలు ప్రస్తుతం బ్యానర్లలో పనిచేస్తూ పొగాకు ప్రోసెసింగ్‌లో తలమునకలయ్యారు.
ఏదేమైనప్పటికీ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా గోదావరి ఏటిపట్టు గ్రామాల్లో వర్జీనియా సాగు క్రమంలో దిగుబడిని వేలం కేంద్రాలకు తరలించే సందడి మొదలైంది.

చిత్రం...తొర్రేడు కేంద్రంలో పొగాకు వేలం నిర్వహిస్తున్న దృశ్యం