బిజినెస్

భారీగా పతనమైన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా పతనమైంది. 10 గ్రాముల బంగారం 405 రూపాయలు నష్టపోయి 32,385 రూపాయల వద్ద ముగిసింది. కిలో వెండి ధర 104 రూపాయలు పడిపోవడంతో 38,246 రూపాయలుగా నమోదైంది. 32,790 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల బంగారం ట్రేడింగ్ మొదటి నుంచే పతనమవుతూ వచ్చింది. పెట్టుబడిదారుల నుంచేగాక, నగల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ లేకపోవడంతో, కొనుగోళ్లు నీరసించాయి. మరోవైపు బీఎస్‌ఈలో సెనె్సక్స్ శర వేగంతో ముందుకు దూసుకెళ్లిన నేపథ్యంలో, మదుపరులు బులియన్‌వైపు అంతగా ఆసక్తి ప్రదర్శించలేదు. సెనెక్స్ ఒకానొక దశలో రికార్డు స్థాయికి చేరుకోవడం సహజంగానే మదుపరులను ఆ దిశగా ఆకర్షించింది. అయితే, చివరికి అటు స్టాక్ మార్కెట్, ఇటు బులియన్ మార్కెట్ కూడా నష్టాల్లో ముగిశాయి. సహజంగా స్టాక్ మార్కెట్ నష్టపోతే, బులియన్ లాభపడుతుంది. బులియన్ నష్టాలను ఎదుర్కొంటే, స్టాక్ మార్కెట్ లాభాల్లో దూసుకెళుతుంది. కానీ, గురువారం స్టాక్ మార్కెట్‌తోపాటు బులియన్ మార్కెట్ కూడా నష్టాల్లో ముగియడం విశేషం.