బిజినెస్

బ్యాంకుల కన్సార్టియం ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ బిడ్డింగ్ (వేలం) వ్యవహారం సజావుగా సాగుతుందని తాము భావిస్తున్నామని ఆ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులు గురువారం విశ్వాసం వ్యక్తం చేశాయి. ఈ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానాలన్నింటి నిర్వహణను బుధవారం తాత్కాలికంగా నిలిపివేసిన క్రమంలో దీనిపై బ్యాంకులు స్పందించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం జెట్ ఎయిర్‌వేస్‌కు అదనంగా నిధులు సమకూర్చేందుకు వెనుకడుగు వేయడంతో ఆ సంస్థ అన్ని విమానాల నిర్వహణకు స్వస్తి పలకాల్సిన అగత్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడాలంటే సమ్మతిని తెలియజేసిన (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) మంచి ఆర్థిక స్తోమత కలిగిన పెట్టుబడిదారుల నుంచి ‘బైండింగ్ బిడ్స్’ను రాబట్టడం ఒక్కటే మార్గమని బ్యాంకుల కన్సార్టియం నిర్ణయించింది. ఆమేరకు ఈనెల 16న ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా జెట్ ఎయిర్‌వేస్‌లో 51 శాతం వాటాలున్న 26 బ్యాంకులతో కూడిన కన్సార్టియం పొటన్షియల్ సూటర్స్ నుంచి బిడ్స్‌ను ఆహ్వానించడం జరిగింది. సంస్థ విలువకు భంగం కలుగకుండా పారదర్శకంగా ఈప్రక్రియ విజయవంతంగా ముగుస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా బ్యాంకుల కన్సార్టియం వ్యక్తం చేసింది. తక్షణమే సంస్థను ఆదుకునేందుకుగాను జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.400 కోట్లు విడుదల చేసేందుకు బుధవారం బ్యాంకుల కన్సార్టియం నిరాకరించిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ప్రత్యర్థి విమానయాన సంస్థల నుంచి గట్టిపోటీ కారణంగా తీవ్రంగా నష్టపోయిన జెట్ ఎయిర్‌వేస్ చివరికి అప్పుల్లో కూరుకుపోయింది. వరుసగా నాలుగు త్రైమాసికాల నుంచి ఇలా ఈ సంస్థ నష్టాలబాటలో నడుస్తోంది. విమానయాన సంస్థగా అంతర్జాతీయంగా అద్భుత గుర్తింపు ఉన్న జెట్ ఎయిర్‌వేస్ అంతర్జాతీయంగా 123 విమానాలను నడుపగాప్రతిరోజూ 600 విమానాలను నిర్వహించేది. అలాంటిది గత మంగళవారం నాటికి కేవలం ఏడు విమానాలను మాత్రమే నడిపే స్థాయికి దిగజారింది. ఈనేపథ్యంలో బుధవారం ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ దూబే ఈ విమానయాన సంస్ధ ప్రయాణికులకు ట్విట్టర్‌లో క్షమాపణ చెబుతూ ‘గుండె బరువు, అణచుకోలేని దుఃఖంతో ఉన్న మా బాధను మీతో పంచుకోదలుచుకున్నాం. తక్షణమే మా నిర్వహణలోని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ నిలివేయక తప్పడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘మధ్యంతర ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా లేమని బ్యాంకుల కన్సార్టియం మంగళవారం రాత్రి మాకు స్పష్టం చేసింది. అందువల్ల మాకు మరే ఇతర తక్షణ ఆర్థిక సాయం అందే అవకాశం లేనందున ఇంధనానికి, ఇతరత్రా కీలక సేవలకు నిధులు వెచ్చించి విమానాలను నడపగలిగే అవకాశాలు లేవు. గత కొన్ని నెలలుగా మధ్యంతర, దీర్ఘకాలిక నిధుల సమీకరణకు అన్ని ప్రయత్నాలనూ మేము చేశాం. ఇవేవీ ఫలించకపోవడంతో విమానాల నిర్వహణను పూర్తిగా నిలిపివేయక తప్పడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం చేపట్టిన బిడ్ ఫైనలైజేషన్ కోసం వేచి చూస్తున్నామని, మళ్లీ మీకు విమానయాన ఆనందాన్ని అందించేందుకు ముందుకు వస్తామ’ని విజయ్ దూబే ట్వీటారు.