బిజినెస్

మైనింగ్ ఆదాయం రూ.4,792 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో 3291 మైనింగ్ లీజుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ. 4792 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వెల్లడించారు. ఈ ఆదాయాన్ని మరింత పెంచడానికి స్టేట్ జియోలజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు ద్వారా ఖనిజాల అనే్వషణను కొనసాగిస్తూ కేంద్ర భౌతిక శాఖ సంస్థల సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. సచివాలయంలో గురువారం కేంద్ర మైనింగ్ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ కే. రాజేశ్వర్‌రావుతో రాష్ట్ర వార్షిక వ్యూహాత్మక కార్యాచరణపై సీఎస్ జోషి చర్చించారు. మైనింగ్ అనుమతుల జారీని వేగవంతం చేయడానికి ప్రత్యేక విధానానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. అటవీ, పర్యావరణ అనుమతులు పొందుతున్న తరహాలో మైనింగ్ లీజుదారులకు కూడా సత్వరం అనుమతులు పొందేలా కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. మైనింగ్ ఆదాయం పెంచడానికి దేశంలోనే మొదటిసారిగా వార్షిక వ్యూహాత్మక కార్యాచరణపై తెలంగాణ రాష్ట్రం నుంచే కేంద్ర మైనింగ్‌ శాఖ శ్రీకారం చుట్టడం హర్హనీయమన్నారు. కేంద్ర మైనింగ్‌శాఖ తీసుకొంటున్న చొరవకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని జోషి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మైనింగ్ అభివృద్థికి ఈ చర్యలు దోహదం చేస్తాయన్నారు. కేంద్ర భూ భౌతిక పరిశోధనల సంస్థ (ఎన్‌జిఆర్‌ఐ) సహకారాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో ఖనిజాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కేంద్ర మైనింగ్‌శాఖ అదనపు కార్యదర్శి కె రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, మైనింగ్ రంగంలో తెలంగాణ అభివృద్ధి సాధించడానికి వివిధ కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. జిఎస్‌ఐ, ఎన్‌జిఆర్‌ఐ, ఐబిఎం వంటి సంస్థల సహకారంతో వివిధ ఖనిజాల అనే్వషణను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర మైనింగ్ అధికారులు, నిపుణులకు తగు శిక్షణ ఇవ్వాలన్నారు. తెలంగాణలో లైమ్ స్టోన్, మాంగనీస్, ఐరన్ ఓర్, కోల్ తదితర ఖనిజాల అనే్వషణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పర్యావరణ హితంగా భద్రతా ప్రమాణాలతో ఖనిజాల వెలికితీతకు సహకారం అందిస్తామన్నారు. ఖనిజాల అనే్వషణకు జిఎస్‌ఐ, ఎన్‌జిఆర్‌ఐ, ఎంఈసీఎల్, ఐబిఎం, ఎఎమ్‌డి తదితర సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను రాజేశ్వర్‌రావు వివరించారు. తెలంగాణ మైనింగ్ డవలప్‌మెంట్ డైరెక్టర్ మల్సూర్ మాట్లాడుతూ, తమ సంస్థకు నేషనల్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీగా గుర్తింపు లభించిందని, నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు తమకు నాలుగు ప్రాజెక్టులు కేటాయించిందన్నారు.
చిత్రం... సచివాలయంలో కేంద్ర గనుల శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమైన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి