బిజినెస్

టాక్సీఫర్‌ష్యూర్‌కు ఓలా గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: రవాణా యాప్ ఓలా.. టాక్సీఫర్‌ష్యూర్ (టిఎఫ్‌ఎస్) వ్యాపారాన్ని మూసేయాలని నిర్ణయించుకుంది. దాదాపు 18 నెలల క్రితం 200 మిలియన్ డాలర్ల (సుమారు 1,300 కోట్ల రూపాయలు)తో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా కొనుగోలు చేసింది. ప్రధాన ప్రత్యర్థి ఉబర్‌కు దేశీయ మార్కెట్‌లో గట్టి పోటీని ఇవ్వాలనుకునే లక్ష్యంలో భాగంగా 2015 మార్చిలో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా సొంతం చేసుకుంది. మరోవైపు ఈ నిర్ణయం అనుబంధ సేవలు, వ్యాపారాభివృద్ధి విభాగాల్లోని కనీసం 700 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే తాము ఔట్‌ప్లేస్‌మెంట్ సర్వీసులు ఎనె్ననో అందిస్తున్నామని, ఇవి బాధిత ఉద్యోగులకు ఓ కొత్త భవిష్యత్తును అందించగలవన్న అభిప్రాయాన్ని ఓలా వ్యక్తం చేసింది.