బిజినెస్

తుది నిర్ణయం తీసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 21: ప్రస్తుతం మూతపడిన జెట్ ఎయిర్ వేస్‌కు చెందిన కొన్ని బోయింగ్ 737 విమానాలను లీజుకు తీసుకుని నడిపేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు భారత అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ ఆదివారం నాడిక్కడ తెలిపింది. బకాయిలు చెల్లించకపోవడం, రుణాలు పేరుకుపోవడం వంటి కారణాలతో నిర్వహణ ఖర్చులకు సైతం నిధులు లేక జెట్ ఎయిర్‌వేస్ గతవారం మధ్యలో నిధుల లేమి కారణంగా జెట్ ఎయిర్‌వేస్ 69 విమానాలను నిర్వహణకు తాత్కాలికంగా నిలుపుల చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 16న చివరి దఫాగా మిగిలిన విమానాల నిర్వహణకూ స్వస్తి పలికింది. ఈక్రమంలో ఆ సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకునేందుకు ఎయిర్ ఇండియా ఆసక్తిని వ్యక్తం చేయడం జరిగింది. కాగా దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ కే సుందర్ మాట్లాడుతూ ‘జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన బి 737 విమానాన్ని లీజుకు తీసుకుని నడిపే విషయంపై ఇంకా ఖచ్చితమైన నిర్ణయానికి రాలేద’ని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అనేక అంశాలు ఇంకా పరిశీలించాల్సివుంది. ప్రత్యేకించి విభాగాలు, ఇరు సంస్థల రంగాలు, ఇతరుల విమాన సమయాలు వగైరాలను పరిశీలించాల్సివుందని ఆయన ఆ విమానయాన సంస్థ ప్రధాన కేంద్రం కొచ్చిన్ నుంచి టెలిఫోన్‌లో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఎన్ని బోయింగ్ విమానాలను ‘జెట్’ నుంచి లీజుకు తీసుకోవాలన్నదానిపై కూడా ఇంకా పూర్తిస్థాయి నిర్ణయం జరగలేద’ని ఆయన మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికంగా కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు, ఆగ్నేయ ఆసియాకు విమానాలను నడుపుతోందని, అలాగే కొన్ని విమానాలను ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి సైతం ఇతర దేశాలకు, కొన్ని దేశీయ మార్గాల్లో సైతం నడుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్వహణలో మొత్తం 25 బోయింగ్ 737 విమానాలున్నాయి. ఇందులో 17 విమానాలు సొంతవికాగా మిగిలిన 8లీజుకు తీసుకున్నవి. వీటితోబాటే జెట్ ఎయిర్‌వేస్ బోయింగ్ విమానాలను నడపాలని ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. జెట్ ఎయిర్‌వేస్ నుంచి 50 మంది కమాండర్స్‌ను నియమించుకోవాలని నిర్ణయించామన్నారు. అలాగే ఇప్పటికే 20 మంది పైలెట్లను నియమించుకోవడం జరిగిందని తెలిపారు. మొత్తం 50 మంది పైలెట్లను నియమించుకోవాలని యోచిస్తున్నామని ఇప్పటికైతే తమకు జెట్ పైలెట్లే అందుబాటులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.