బిజినెస్

భారీ కంపెనీల ఫలితాలే మార్కెట్ మార్గనిర్దేశకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న వివిధ భారీ కంపెనీలకు సంబంధించిన గత ఆర్థిక సంవత్సరం చివరి, నాలుగో త్రైమాసిక ఫలితాలే ఈవారం స్టాక్ మార్కెట్‌కు మార్గనిర్దేశకాలు కానున్నాయి. మార్చి 31వ తేదీతో ముగిసిన చివరి త్రైమాసిక ఫలితాలను పలు కంపెనీలు ప్రకటిస్తున్నాయి. దీనితో గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆయా కంపెనీల తీరుతెన్నులు, లాభనష్టాల వివరాలు కూడా అందుతాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త వారం స్టాక్ మార్కెట్ మార్కెట్‌లో పెద్దపెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాల పాత్ర కీలకమన్నది వాస్తవం. దీనితోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, రూపాయి మారకపు విలువ, పెట్టుబడుల పొకడలు వంటి ఇతర అంశాలు కూడా వచ్చేవారం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. స్వల్పకాల మదుపరులంతా ఎక్కువగా గత ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసిక ఫలితాలనే ప్రమాణికంగా తీసుకొని, తగిన నిర్ణయాలు తీసుకుంటారు. కార్పొరేట్ బ్యాంక్‌లు, ఐటీ కంపెనీలు, ఇతర ప్రాధాన్యతా రంగాల్లో ఫలితాలే పెట్టుబడిదారులు తీసుకోబోయే నిర్ణయాలకు పునాదులవుతాయి. కార్పొరేట్ రంగానికి విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే, భారీ కంపెనీల లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాత, విదేశీ పెట్టుబడుల పరిణామం స్పష్టమవుతుంది. ఏ స్థాయిలో ఎఫ్‌ఐఐ తరలి వస్తాయి? ఎంత మొత్తంలో స్టాక్ మార్కెట్ లాభపడుతుంది? అనే ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ మార్కెట్‌లో భారీ మార్పులేవీ ఉండకపోవచ్చన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. ఆర్థిక సేవల పరిశ్రమ ఉత్తమ ఫలితాలను రాబడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ తదితర సంస్థల షేర్లకు డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్ల గమనం కూడా భారత మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోనూ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని జియోజిట్ ఫైనాన్షిల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అభిప్రాయపడుతున్నారు. శామ్‌కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్‌నోట్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జిమీత్ మోదీ కూడా దాదాపు అలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగం వచ్చేవారం ఎక్కువ లాభపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మారుతీ సుజికీ, హీరో మోటార్‌కార్ప్ తదితర కంపెనీల షేర్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు. మొత్తం మీద గత వారం మూడు రోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యంకాగా, సెనె్సక్స్ 373.17 పాయింట్లు లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర కంపెనీలు షేర్లకు డిమాండ్ ఉంటుందని అంచనా. అయితే, స్టాక్ మార్కెట్‌లో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, కాబట్టి, అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉండవని అనుకోవడానికి వీల్లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.