బిజినెస్

వ్యాపారుల కోసం ప్రత్యేక సైబర్ నష్టాల రక్షణ బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: సైబర్ నేరాల కారణంగా జరిగే నష్టాల నుంచి భద్రత కల్పించేలా సైబర్ డిఫెన్స్ ఇన్సూరెన్స్’ను ప్రారంభించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ విభాగం సోమవారం నాడిక్కడ ప్రకటించింది. తొలి విడతగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సంస్థలకు (ఎస్‌ఎమ్‌ఈలకు), మధ్య తరహా వ్యాపార సంస్థలకు ఈ ‘ప్రాడక్ట్ ప్రొటెక్ట్ బిజినెస్’ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని, తదుపరి అన్ని రకాల వ్యాపార సంస్థలకు కూడా అందుబాటులోకి తెస్తామని ఆ బ్యాంక్ ప్రకటించింది. హ్యాకింగ్‌లు, వ్యక్తిగత సమాచారం (ఐడెంటిటీ) చౌర్యం, సున్నిత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వంటి కారణాలతో జరిగే వ్యాపార నష్టాల నుంచి భద్రత కల్పించేలా ఈ బీమా పథకాన్ని డిజైన్ చేసినట్టు ఆ ప్రకటన వెల్లడించింది. రానున్న రోజుల్లో డిజటల్‌గా మరింత అభివృద్ధిని సంతరించుకునే అవకాశం ఉందని, దానిపై భద్రత కల్పించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. కాగా తమ ప్రాడక్టు ద్వారా ఫస్ట్, థర్డ్ పార్టీ కవరేజ్ బెనిఫిట్‌ను కల్పిస్తున్నట్టు, అదే విధంగా అత్యవసర వ్యాపార ఆటంకాలు, సిస్టం ఫెయిల్యూర్లు, కం ప్యూటర్ నేరాలు, మల్టీ మీడియా ప్రాధాన్యతలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి వస్తాయని ఆ ప్రకటన తెలిపింది.