బిజినెస్

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 22: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతోబాటు ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతులు చేసుకోవడంపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేయడంతో భాతర స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే కార్పొరేట్ సంస్థల త్రైమాసిక నివేదికలు సైతం మిశ్రమ ఫలితాలనే నమోదు చేయడం మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేసింది. దీంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెనె్సక్స్ 495 పాయింట్లు, నిఫ్టీ 158 పాయింట్లు కోల్పోయాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ మొత్తం 495.10 పాయింట్లు కోల్పోయి 1.26 శాతం నష్టాలతో 38,645 వద్ద దిగువకు చేరింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 158.35 పాయింట్లు కోల్పోయి 1.35 శా తం నష్టంతో 11,594.45 వద్దకు దిగివచ్చింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలకు సంబందించిన వార్తలు రావడంతో ముడిచమురు ధరలు నెల రోజుల గరిష్టానికి చేరాయి. ఇంట్రాడేలో ఈ ధరలు 2.56 శా తం పెరిగి బ్యారల్ ధర 73.81 డాలర్లు పలికింది. దీంతో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు తగ్గిపోయి 69.63 రూపాయలకు చేరింది. కాగా ముడిచమురు దిగుమతి ధరలు ఇ లా పెరగడం భారత మార్కెట్లకు మంచిదికాదని ప్రముఖ వాణిజ్య విశే్లషకుడు జగన్నాథం తుంగుం ట్ల పేర్కొన్నారు. మే 2 తర్వాత ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకునే ఏ దేశానికీ తమ సహకారం ఉండదని అమెరికా కార్యదర్శి (స్టేట్) మైక్ పోంపియో తాజాగా ప్రకటించడం మార్కెట్‌లో పె ద్ద చర్చకు దారితీసింది. చైనా, భారత్ ప్రస్తుతం ఇరాన్ నుంచి అత్యధికంగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఆం క్షలకు ఈ దేశాలు తలొగ్గకపోతే ద్వైపాక్షిక బంధాలను విఘాతం కలగడంతోబాటు, ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని, ప్రధానంగా వాణిజ్య బంధాలకు ఇక్కట్లు తప్పవని విశే్లకులు అభిప్రాయపడుతున్నారు. ఇలావుండగా సెనె్సక్స్ ప్యాక్‌లో సోమవారం ఎస్ బ్యాంకు, ఇండస్ట్రియల్ బ్యాంకు, రిలయన్స్ ఇండియా లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) భారీగా నష్టాలను చవిచూశాయి. ఈ సంస్థలు దాదాపు 6.78 శాతం నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, వేదాంత, ఓఎన్‌జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌పార్మా, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ దాదాపు 2.20 శాతం నష్టపోయాయి. మరోవైపు మార్కెట్ల పూర్తి వారానికి సం బంధించిన అంచనాలను పరిశీలిస్తే భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ సుమారు 0.89 శాతం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.