బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు ప్రత్యేక రుణ సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 22: ప్రస్తుతం మూసివేతకు గురైన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 22వేల మంది ఉద్యోగులను ఆదుకునేందుకు బ్యాంకుల కన్సార్టియం ముందుకు రావాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు సోమవారం నాడిక్కడ సూచించాయి. జీతాలు రాక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న ఆ ఉద్యోగులకు ప్రత్యేక రుణ సదుపాయాన్ని బ్యాంకులు కల్పించాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి. జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణను చేపట్టి ఆ సంస్థకు చెందిన ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత వారం బ్యాంకుల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం జరిగింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తిరిగి బ్యాంకింగ్ లాబీకి లేఖ రాస్తూ తక్షణం ఆ ఉద్యోగులను ఆదుకునేలా ప్రత్యేక రుణ సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినయ్‌దూబే గత శనివారం మాట్లాడుతూ ఉద్యోగులకు కనీసం ఒకనెల జీతం ఇవ్వాలన్నా రూ. 170 కోట్లు అవసరం అవుతాయని పేర్కొనడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల పాటు నడిచిన ఈ సంస్థకు తక్షణ మధ్యంతర సహకారంగా రూ.400 కోట్లు అందజేసేందుకు బ్యాంకుల కన్సార్టియం నిరాకరించడంతో పూర్తిగా మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దూబే, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్తివార్, పౌర విమానయాన సంస్థ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ కరోలా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్‌లతో కలిసి పైలెట్ల సంఘాల ప్రతినిధులు, ఇంజనీర్లు, కేబిన్ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బందిని సైతం కలుపుకుని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని గత వారాంతంలో కలుసుకుని చర్చలు జరిపారు. జెట్ ఎయిర్‌వేస్ వెతలను పరిష్కరించేందుగల అవకాశాలను పరిశీలిస్తానని జైట్లీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ విమానయాన సంస్థ బ్యాంకులకు మొత్తం రూ. 8,500 కోట్ల మేర రుణాలుగా తీసుకుంది. అలాగే ఈ సంస్థలో చిరు వ్యాపారులు, ఎయిర్ క్రాఫ్ట్ లీజర్లకు, ఉద్యోగుల జీతాలకు సుమారు రూ. 4000 కోట్లమేర చెల్లించాల్సివుంది. అంతేకాక ప్రయాణికులకు టికెట్ రీఫండింగ్ బకాయిలు సైతం వేలాది కోట్లున్నాయి. అంటే వీటన్నింటికీ ఈ సంస్థకు రూ. 13 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి. ఈ క్రమంలోప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్‌కు చెందిన వాటాల విక్రయానికి చేపట్టిన బిడ్డింగ్ ప్రక్రియపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఇది విజయవంతం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో బ్యాంకులు సైతం తమ వంతు కృషిగా ఈ ఎయిర్‌లైన్‌ను ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో సాధ్యమైనంత త్వరగా విలీనం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.