బిజినెస్

ఔషధ రంగ ఎగుమతుల్లో 11% వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: మనదేశ ఔషధ రంగం (పార్మాస్యూటికల్) ఎగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరంలో 11 శాతం మేర పెరిగాయి. అంటే అదనంగా 19.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. ప్రధానంగా ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో మన ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌తో ఈ అదనపు ఎగుమతులకు ఆస్కారం ఏర్పడిందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మనదేశం నుంచి 17.3 బిలియన్ డాలర్ల ఔషధాల ఎగుమతులు జరగ్గా అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో 16.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని ఆ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. మొత్తం మనదేశ ఎగుమతుల్లో ఉత్తర అమెరికాకు 30 శాతం జరిగాయి. అలాగే ఆఫ్రికా దేశాలకు 19 శాతం, ఐరోపా దేశాలకు 16 శాతం వంతున జరిగాయి. ఇలావుండగా చైనా సైతం ఈ ఎగుమతుల్లో క్రమంగా తన భాగస్వామ్యాన్ని వృద్ధి చేసుకుంటోందని వాణిజ్య రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు. ఈక్రమంలో ఈ ఎగుమతులను విస్తరించి అంతర్జాతీయంగా పట్టు సాధించాలని మన ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అలాగే దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్, జర్మనీలకు సైతం మన ఎగుమతులు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి జరిగిన అన్ని రకాల ఎగుమతుల్లో 331 బిలియన్ డాలర్ల విలువైన పార్మాస్యూటికల్ ఎగుమతలు జరిగాయి. అంటే 6 శాతం ఈ ఎగుమతులు జరిగాయి. మనదేశ ఆదాయంలో 75 శాతం మార్కెట్ షేర్‌తో ఎగుమతుల్లో ప్రాధాన్యత గల ఐదు రంగాల్లో ఒకటిగా ఔషధ రంగం ఆవిర్భవించింది. మనదేశం అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా 20 శాతం జనరిక్ ఔషధాలను సరఫరా చేస్తోందని, ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ ఔషధ ఎగుమతి దారుగా మనదేశం గుర్తింపు పొందిందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. అతిపెద్ద నియంత్రణ కలిగిన దేశాలకు సైతం ఈ ఎగుమతులు జరుగుతుంటడం విశేషం. నౌకల ద్వారా జరిగే ఎగుమతులు సైతం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలతోబాటు విదేశీమారక ద్రవ్యం ఆర్జించేందుకు తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి వీలవుతోంది.