బిజినెస్

మైక్రో ఫైనాన్స్ రంగానికి మంచి భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: మైక్రో ఫైనాన్స్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సూర్యాదయ్ తొలి బ్రాంచిని ఏర్పాటు చేసినట్లు ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ బాబు చెప్పారు. ఈ బ్రాంచిని ఎన్‌ఎండీసీ జీఎం ఏకే పాథే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ భాస్కర్ బాబు మాట్లాడుతూ, దేశంలోని పది రాష్ట్రాల్లో 380 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. తమ బ్యాంకుకు డిపాజిట్లు రూ.1600 కోట్లు ఉన్నాయని, రుణాల పోర్ట్ఫులియో రూ.3000 కోట్లు అని చెప్పారు. ఇటీవల తమ బ్యాంకు రూ.248 కోట్ల పెట్టుబడులను సేకరించిందన్నారు. తమ బ్యాంకు ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయిందని చెప్పారు. సేవింగ్ అకౌంట్‌లో 7.25 శాతం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రేట్లను ఇస్తున్నట్లు చెప్పారు. సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం మేర వడ్డీస్తామన్నారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా తమ బ్యాంకు 2017లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెచప్పారు. గృహ, వాణిజ్య వాహనాల కొనుగోలుకు రుణాలు ఇస్తామన్నారు.
స్మార్ట్ ఏసీల తయారీ రంగంలో అడుగుపెట్టిన లివ్‌ప్యూర్
మంచినీటి పరిశుద్ధ బ్రాండ్ లివ్‌ప్యూర్ సంస్థ స్మార్ట్ ఎయిర్ కండిషనర్ల తయారీ రంగంలో అడుగుపెట్టింది. హెకా టెక్నాలజీతో తొలిసారిగా ఏసీని మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. లివ్‌ప్యూర్ స్మార్ట్ ఏసీలో వైఫై, ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ తదితర సదుపాయాలు ఉన్నాయని ఆ సంస్థ ఎండీ రాకేష్ మల్హోత్రా చెప్పారు. 40 శాతం విద్యుత్‌ను ఆదా చేసే విధంగా ఏసీలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఇంటర్‌యాక్టివ్ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు మొబైల్‌ను రిమోట్‌గా ఏసీతో అనుసంధానం పొందవచ్చని చెప్పారు.