బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయంగా ప్రతికూల ధోరణులు బలమైన పాత్ర పోషించిన నేపథ్యంలో, గురువారం భారత స్టాక్ మార్కెట్ కుదేలైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 324 పాయింట్లు పతనంకాగా, జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 11,650 పాయింట్లకు దిగువున ముగిసింది. ఆటో, మెటల్, ఎనర్జీ, ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించిన కంపెనీల షేర్లకు డిమాంత్ తగ్గి, అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ముడి చమురు ధరల్లో తగ్గుదల, రూపాయి మారకపు విలువ పతనం వంటి అంశాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను శాసించాయి. కార్ల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన మారుతీ సుజికీ విడుదల చేసిన గత ఆర్థిక సంవత్సర ఫలితాల నివేదిక కూడా మదుపరులపై ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 4.6 శాతం తగ్గడంతో, 1,795.6 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. దీనితో కంపెనీ షేర్ల ధర 2.23 శాతం పతనమైంది. ఇలాంటి ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. నిజానికి, బుధవారం నాటి లాభాల నేపథ్యంలో గురువారం ఉదయం మార్కెట్ సానుకూల ధోరణుల మధ్య మొదలైంది. కానీ, దేశీయంగానేగాక, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల కారణంగా సెనె్సక్స్ పతనం ప్రారంభమైంది. మధ్యలో ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, దాదాపుగా సాయంత్రం వరకూ పతనం కొనసాగింది. ఫలితంగా 323.82 పాయింట్లు (0.83 శాతం) నష్టపోయిన సెనె్సక్స్ 38,730.86 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 84.35 పాయింట్లు (0.72 శాతం) నష్టపోయి 11,641.80 పాయింట్లకు పరిమితమైంది. రూపాయి మారకపు విలువ 39 పైసలు పతనమైంది. దీనితో అమెరికా డాలర్ విలువ 70.25 రూపాయలకు పెరిగింది. సెస్సెక్స్‌లో గురువారం భారీగా నష్టపోయిన కంపెనీల జాబితాలో టాటా స్టీల్, వేదాంతా, మారుతీ సుజికీ, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. వీటి షేర్ల ధర సగటున 2.89 శాతం పతనమైంది. కాగా, ప్రతికూల పరిస్థితులను సైతం సమర్థంగా అధిగమించిన భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు సగటున 2.08 శాతం లాభాలను ఆర్జించాయి. మొత్తం మీద మార్కెట్ అనిశ్చితి మధ్య కొనసాగడం ఆనవాయితీగా మారింది. ఒకరోజు భారీ లాభాలు, మరో రోజు నష్టాలు సామాన్యమయ్యాయి. ఒక రోజు ట్రేడింగ్‌లోనే అత్యధిక లాభా ల మైలురాయిని చేరినప్పటికీ, చివరికి నష్టాల్లో ముగిసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి భార త మార్కెట్‌ను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. బుధ, గురువారాల్లో జరిగిన ట్రేడింగ్ ఈ అనిశ్చిత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకూ ఒడిదుడుకులు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.