బిజినెస్

రహేజా మైండ్‌స్పేస్‌లో ఎన్‌సిఆర్ కార్పొరేషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: అంతర్జాతీయంగా ఓనీ చానల్ సొల్యూషన్స్‌ను ఏర్పాటు చేసిన ఎన్‌సిఆర్ కార్పోరేషన్‌ను వచ్చే ఏడాది హైటెక్ సిటీలో రహేజా మైండ్‌స్పేస్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఇ రోస్నర్ ప్రకటించారు. అంతర్జాతీయంగా గ్లోబల్ సెంటర్‌గా ఎన్‌సిఆర్‌ను తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. పరిశోధన, సృజనాత్మకత, డిజైన్ తదితర రంగాల్లో టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఎన్‌సిఆర్ హైదరాబాద్ ఆర్ అండ్ డి సెంటర్ సాఫ్ట్‌వేర్ సంస్ధల్లో అతి పెద్ద సెంటర్‌గా అవతరించనున్నట్లు ఆయన చెప్పారు. 2004లో 50 ఇంజనీర్లతో ఎన్‌సిఆర్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పుడు పరిశోధన, అభివృద్ధి విభాగంలో 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు.