బిజినెస్

కోర్టు వివాదాలు పరిష్కరించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: సుమారు ఐదేళ్లుగా సాగుతున్న కోర్టు వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా తాము ప్రయత్నాలు సాగిస్తున్నామని భాగస్వామ్య కంపెనీలు మెక్‌డోనాల్డ్స్, విక్రమ్‌బక్షి సోమవారం నాడిక్కడ వెల్లడించాయి. ఈమేరకు జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యులతో కూడిన నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ధర్మాసనానికి ఆ కంపెనీలు తమ రాజీ వైఖరిని తెలియజేశాయి. తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసిన ధర్మాసనం ఆ లోగా రాజీకి సంబంధించిన నిబంధనావళితో కూడిన అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది. అమెరికాకు చెందిన ఫాస్ట్ఫుడ్ చైన్ ఔట్‌లెట్‌లను భారత్‌లో నిర్వహించడంపై ఈ రెండు కంపెనీలు 1995లో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం 25 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈమేరకు రెండు కంపెనీలు 50-50 శాతం భాగస్వామ్యంతో కన్నౌట్ ప్లాజా రెస్టారెంట్ లిమిటెడ్ (సీపీఆర్‌ఎల్)ను ఏర్పాటు చేశాయి. దేశంలోని ఔట్‌లెట్ల నిర్వహణకు ఇది కేంద్రంగా వ్యవహరించేది. ఐతే 2017లో మెక్‌డోనాల్డ్స్ సీపీఆర్‌ఎల్‌ను రద్దు చేస్తూ ఒప్పందానికి తిలోదకాలిచ్చింది. ప్రాంచైసీకి సంబంధించిన రాయల్టీలు తమకు అందని కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. దాదాపు 165 మెక్‌డొనాల్డ్స్ బ్రాండెడ్ ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న విక్రమ్ బక్షీ అప్పనుంచి న్యాయపోరాటానికి దిగింది.