బిజినెస్

అదిరిన అక్షయ తృతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: మండుటెండలో పసిడి షాపులు మంగళవారం ధగధగ మెరిసిపోయాయి. అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయాలన్న సామాన్య, మధ్య తరగతి ప్రజల సెంటిమెంట్‌ను వ్యాపారులు బాగా సొమ్ము చేసుకున్నాయి. రోజువారీ కొనుగోళ్ల కంటే అక్షయ తృతీయ రోజున రెండింతలు ఎక్కువగా బంగారు కొనుగోళ్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారు కొనుగోళ్లు సుమారు 200 కేజీలు ఉంటుండంగా మంగళవారం ఒక్క రోజునే (అక్షయ తృతీయ) 600 కేజీల వరకు అమ్మకాలు జరిగినట్టు సికింద్రాబాద్ హోల్ సేల్ వ్యాపార వర్గాల అంచనా. మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కార్పొరేట్ షాపులు గిఫ్ట్‌లు, లాటరీలు, మజూరీ, ధరపై కోతలు తదితర ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకున్నారు. అయితే కార్పొరేట్ షాపులతో పోటీ పడలేక రిటైల్ షాపులు వెలవెల పోయాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్‌కమాన్, చార్మినార్, అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, జనరల్ బజార్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, మాదాపూర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా మల్‌బార్ గోల్డ్, కల్యాణి జ్యూవెలర్స్, ఖజానా, శ్రీకృష్ణ జ్యూవెలర్స్, జయ్‌లుకాస్, లలితా జ్యూవెలర్స్ తదితర కార్పొరేట్ షాపులు పోటీలు పడి ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులతో కిక్కిరిసి పోయాయి. ఈ షాపులు భారీ ఆఫర్లను ఇవ్వలేక రిటైల్ షాపులు వెలవెల పోయాయి. కార్పొరేట్ షాఫుల్లో బాగా కొనుగోళ్లు జరిగినప్పటికీ ఆశించిన మేరకు వ్యాపారం జరగలేదని హైదరాబాద్, సికింద్రాబాద్ గోల్డ్ మార్చంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగదీశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్ల సీజన్ దాదాపు ముగిసిపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చని ఆయన అన్నారు. ఇలా ఉండగా కార్పొరేట్ షాపుల్లో కనీసం 20 నుంచి 25 కేజీలకు తక్కువ కాకుండా అమ్మకాలు జరిపిన షాపులు సుమారు వంద, నూటయాభై వరకు ఉంటాయని వ్యాపార వర్గాల తెలిపాయి. కేజీ నుంచి ఐదు కేజీల వరకు అమ్మకాలు జరిపిన షాపులు 30 నుంచి 50 రిటైల్ షాపులు ఉంటాయని ఈ వర్గాల అంచనా. ఇలా ఉండగా బంగారు కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్రాలకు కలిపి పన్ను రూపేణ (సిఎస్‌జి, జిఎస్‌టి) మూడు శాతం కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ బులియన్ మార్కెట్‌లో అమ్ముడుపోయిన బంగారంపై సుమారు అక్షయ తృతీయ రోజున రూ. 6 కోట్ల వరకు జిఎస్‌టి వసూలు అయినట్టు వ్యాపార వర్గాల అంచనా. అక్షయ తృతీయ కోసం ఫ్రీ బుకింగ్‌లను రెండు వారాల కిందటి నుంచే ప్రకటించడంతో కార్పొరేట్ షాపులు ఆశించిన మేరకు లాభాలు గడించలేదని తెలిసింది. అయితే వ్యాపారాన్ని పెంచుకోవడానికి మాత్రం ఫ్రీ బుకింగ్ దోహదపడిందని చెబుతున్నారు. మజూరీ తగ్గింపు, బంగారు కొనుగోళ్లపై ఉచితంగా వెండి నాణేలు ఇవ్వడం వంటి ఆఫర్లవల్ల కూడా లాభాలు తగ్గినట్టు హోల్ షాపు యజమాని ఒకరు తెలిపారు. అక్షయ తృతీయ సెంటిమెంట్‌ను బంగారు వ్యాపారులు క్యాష్ చేసుకోవడంలో మాత్రం సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు.