బిజినెస్

వాణిజ్య ఒప్పందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు రంగం సిద్ధమైంది. ఇరు దేశాల అధికారులు బుధవారం ఇక్కడ సమావేశమై వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు ఈ చర్చలో కీలకం కానున్నాయి. చైనా కస్టమ్స్, సాధారణ పాలన శాఖ ఉప మంత్రి లీ కుయొ తమ దేశ బృందానికి నాయకత్వం వహిస్తారు. భారత్ తరఫున వ్యవసాయ, పశుసంపదతోపాటు అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) అధికారులు కూడా పాల్గొంటారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై భారత్-చైనా అధికారులు దృష్టి సారిస్తారు. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై పరస్పర అవగాహన, ఇచ్చి పుచ్చుకోవడాలపై తీర్మానాలు చేస్తారు. అదేవిధంగా ఉద్యానవన, చేనేత, రసాయన, ఔషధ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. మొత్తం 380 ఉత్పత్తులపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి.