బిజినెస్

దక్షిణాది రాష్ట్రాలకు చిత్తూరు ‘చింత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె: చిత్తూరు జిల్లాలో లభించే చింతపండుకు దక్షిణాధి రాష్ట్రాలలో డిమాండ్ పెరిగింది. గత ఏడాది మినహా ఐదారేళ్లుగా సరైన ధర లేక దిగాలుపడిన చింతపండు రైతులు, వ్యాపారులకు ఈఏడాది అశాజనకమైన ధరలు లభిస్తున్నాయి. గింజలు తీసి శుభ్రం చేసిన ఎండిన చింతపండుకు అప్పట్లో రూ.100లు లభించగా నేడు రూ.150లు ధర పలుకుతోంది. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మినహా ఈ సంవత్సరం చింతపండు దిగుబడి సగానికి సగం పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లా ప్రధానంగా పడమటి ప్రాంతం నుంచి ఎగుమతి అయ్యే పులుపు కలిగిన చింతపండుకు మరింత గిరాకీ పెరిగింది. ధరలు లేక దిగాలు పడిన చింతపండుకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం కోలుకుంది. జిల్లాలో మదనపల్లె, కురబలకోట, పుంగనూరు చింతపండు పరిశ్రమకు ప్రసిద్ది. ఈ ప్రాంతాల్లో సుమారు పాతికవేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి నెమ్మదిగా పెరిగిన ధరలు ఊపందుకున్నాయి. ధరలు పెరగడంతో చింతపండును ఇక్కడనుంచి కర్నాటక రాష్ట్రం బళ్లారి, తెలంగాణలోని హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, రాష్ట్రంలోని నెల్లూరు, గూడూరు, విజయవాడ, విశాఖపట్నం, తమిళనాడు రాష్ట్రం చెన్నై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవాలకు తరలిస్తున్నారు. క్వింటాలు కట్టిచింతకాయ ధర రూ.48వేల నుంచి రూ.56వేలు పలుకుతోంది. గత ఏడాది రూ.32వేల నుంచి రూ.34వేలు పలికింది. గత ఐదారేళ్లుగా వర్షాభావంతో చింతపండు దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం చింతపండుకు డిమాండ్‌తోపాటు ధరలను పోల్చుకుంటే నేడు అత్యధికంగా పలుకుతోంది. 2014లో కిలో కరిపులి ధర రూ.30లు కాగా 2015లో రూ.40లు పలికింది. 2016లో రూ.55లు 2017లో రూ.65లు, 2018లో రూ.100లు, ప్రస్తుతం రూ.120లు ధర పలుకుతోంది. ప్లవర్ రకం సీజన్‌లో రూ.60లు నుంచి రూ.72లు ఉండగా ప్రస్తుతం రూ.80ల నుంచి రూ.90లు, చపాతి రూ.90ల నుంచి రూ.100లు పలుకగా, ప్రస్తుతం రూ.150లు పలుకుతోంది. కట్టిచింతకాయ బండి (600కిలోలు) రూ.42వేలు ధర పలుకుతోంది. ఈ ఏడాది రైతుల వద్ద సరుకు ఉన్నపుడే ఆశాజనకమైన రేట్లు వచ్చాయి. సేకరించిన చింతపండు నిల్వలను కోల్డ్ స్టోరేజిలో ఉంచడంతో తమకు పెట్టిన ఖర్చులు పోగా ఆదాయం దక్కిందని వ్యాపారులు, రైతులు అంటున్నారు.
చిత్తూరు ‘చింత’కే డిమాండ్
దక్షిణ భారతదేశంలో చిత్తూరుజిల్లా మదనపల్లె, కురబలకోట, పుంగనూరుప్రాంతాల చింతకాయకు భలే డిమాండు ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లభించే చింతపండు కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. మూడేళ్ల వర్షాభావం కారణంగా చింతరైతులు ఆశించినంత దిగుబడి లేకపోయినా, గత ఏడాది దిగుబడి బాగానే లభించింది. పంటదిగుబడి ఎలావున్నా ధరల వ్యత్సాసాలతో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో నర్సరీల ద్వారా దిగుబడి అవుతున్న చింతపండుకు ధీటుగా చిత్తూరు చింతపండు ఎగుమతికి డిమాండు ఉంటోంది. ప్రతిఏటా ఇతర రాష్ట్రాల వ్యాపారులు చిత్తూరు చింతపండు కొనుగోలుకు పోటీపడుతారు. ఈ ఏడాది పంటదిగుబడి తగ్గుముఖం పట్టింది. అయితే ధరలు ఓ మోస్తారుగా పెరగడంతో కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వవుంచిన వ్యాపారులకు డిమాండు పెరుగుతోంది.
కూలీల ‘చింత’ కష్టం తీరేనా?
చింతపండు పరిశ్రమలో చెట్టేక్కి కాయలు రాల్చే కూలీకి రోజుకు రూ.350లు, కాయలు ముబ్బడి తొలగించి కట్టికాయ శుద్ధిచేసే కూలికి రోజుకు రూ.180లు చెల్లిస్తారు. కాయలోని చింతగింజలు తొలగించి శుద్ధి అనంతరం కిలోవంతున ప్యాక్‌చేస్తే కిలోకు రూ.5లు చెల్లిస్తారు. ఏడాదిలో మార్చి, ఏప్రిల్ మాసాలలో కాయలు రాల్చడం, మే నెలరోజుల పాటు ఒబ్బడి తొలగించి కట్టికాయ నిల్వ ఉంచుతారు. కట్టికాయ నుంచి చింతగింజలు తొలగించి శుద్ధిగా ప్యాక్‌చేసి వచ్చేకూలీతో జీవనం సాగించే కుటుంబాలు అధికంగా ఉన్నాయి. వీరి సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. తమను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
చిత్రం...చింతకాయలను ఒబ్బిడి చేస్తున్న మహిళా కూలీలు