బిజినెస్

అనుబంధ బ్యాంకుల విలీనానాన్ని ఆమోదించిన ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: భారతీయ మహిళా బ్యాంకు (బిఎంబిఎల్)తో పాటు మరో మూడు అనుబంధ బ్యాంకుల విలీనానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) డైరెక్టర్ల బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఎస్‌బిఐ పరిమాణం అంతర్జాతీయ స్థాయికి పెరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బిబిజె), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బిఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్‌బిటి), భారతీయ మహిళా బ్యాంకు లిమిటెడ్ (బిఎంబిఎల్)లను విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను తమ సెంట్రర్ బోర్డు డైరెక్టర్లు ఆమోదించారని ఎస్‌బిఐ గురువారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా (ఎస్‌బిపి) విలీన ప్రస్తావన ఈ ప్రతిపాదనలో లేదు. ఈ విలీన ప్రతిపాదన ప్రకారం ఎస్‌బిబిజె షేర్‌హోల్డర్లకు ప్రతి 10 షేర్లకు (ఒక్కోటి 10 రూపాయలు) 28 చొప్పున ఎస్‌బిఐ షేర్లు (ఒక్కో షేరు రూపాయి), ఎస్‌బిఎం, ఎస్‌బిటి షేర్‌హోల్డర్లకు ప్రతి 10 షేర్లకు 22 చొప్పున ఎస్‌బిఐ షేర్లు లభిస్తాయి. ఇక భారతీయ మహిళా బ్యాంకు షేర్‌హోల్డర్ల విషయానికొస్తే, ఒక్కో షేరు రూ.10 చొప్పున ప్రతి 100 కోట్ల షేర్లకు 4,42,31,510 ఎస్‌బిఐ షేర్లు లభిస్తాయి.