బిజినెస్

వాటాల బైబ్యాక్ చేయనున్న ‘వెల్స్‌పన్ కార్ప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: వెల్స్‌పన్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన వెల్స్‌పన్ కార్పొరేషన్ లిమిటెడ్ తన వాటాలను బై బ్యాక్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్ణ యం తీసుకునేందుకు సంస్థ బోర్డు ఈనెల 14న సమావేశమవుతుందని శుక్రవారం నాడిక్కడ ఆ కంపెనీ వెల్లడించింది. రూ. 5 వౌఖిక విలువతో పూర్తి మెచూరిటీ కలిగిన కంపెనీ ఈక్విటీ వాటాలను తిరిగి కొనుగో లు చేయాలన్న ప్రతిపాదనకు కంపెనికి చెందిన బోర్డు ఆమోదం తెలపాల్సివుందని వెల్‌స్పన్ కంపెనీ తన రెగులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. ఐతే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ కంపెనీ తెలియజేయలే దు. అలాగే 2019 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి ఆర్థిక గణాంకాలకు సైతం బోర్డు ఆమోదం తెలపాల్సివుందని ఆ కంపె నీ వెల్లడించింది. అలాగే గడచిన ఆర్థిక సం వత్సరానికి ఈక్విటీ వాటాలకు చెల్లించాల్సిన డివిడెండ్‌పై కూడా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. కాగా ప్రపంచంలో అతి పొడవైన వెల్డెడ్ పైప్‌లైన్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా వెల్స్‌పన్ కార్ప్ గణుతికెక్కింది. ఈ కంపెనీ వాటాలు స్టాక్ మార్కెట్లో శుక్రవారం 2.96 అదనంగా లాభపడి ఒక్కో వాటా రూ. 144.15గా ట్రేడయ్యాయి.