బిజినెస్

కొనసాగిన పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఎనిమిదో రోజు నష్టాలను ఎదుర్కొంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో 95.92 పాయింట్లు (0.26 శాతం) కోల్పోయిన సెనె్సక్స్ 37,462.99 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 22.90 పాయింట్లు (0.20 శాతం) పతనమై, 11,278.90 పాయింట్లకు పడిపోయింది. శుక్రవారం ఉదయం బీఎస్‌ఈలో లావాదేవీలు ప్రారంభమైనప్పటి నుంచి చివరి క్షణం వరకూ సెనె్సక్స్ హెచ్చుతగ్గులు కొనసాగాయి. ఒక దశలో అత్యల్పంగా 37,370.39 పాయింట్లకు, మరో దశలో అత్యధికంగా 37,721.98 పాయింట్లకు చేరిన సెనె్సక్స్ చివరికి, రెంటికీ మధ్యే మార్గంగా ముగిసింది. నిఫ్టీ సైతం అదే రీతిలో అత్యల్పంగా 11,278.90 పాయింట్లు, అత్యధికంగా 11,345.80 పాయింట్లుగా నమోదైంది. అటు బీఎస్‌ఈలోనూ, ఇటు ఎన్‌ఎస్‌ఈలోనూ టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. టాటా స్టీల్ షేర్లు బీఎస్‌ఈలో 6.10 శాతం నష్టపోగా, ఎన్‌ఎస్‌ఈలో ఈ నష్టం 6.20 శాతంగా నమోదైంది. అదే విధంగా హెచ్‌సీఎల్ టెక్ బీఎస్‌ఈలో 4.07 శాతం, ఎన్‌ఎస్‌ఈలో 4.54 శాతం నష్టాలను చవిచూసింది. ఎస్ బ్యాంక్‌కు బీఎస్‌ఈలో 3.70 శాతం, ఎన్‌ఎస్‌ఈలో 3.46 శాతం నష్టాలు తప్పలేదు. ఇండస్‌ఇండ్ బ్యాంక్ (2.44 శాతం), ఓఎన్‌జీసీ (1.74 శాతం) బీఎస్‌ఈలో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ (3.08 శాతం), ఇండియన్ ఆయిల్ (2.06 శాతం) ఎన్‌ఎస్‌ఈలో నష్టాలు చవిచూశాయి. ఇలావుంటే, ప్రతికూల పవనాలు సమర్థంగా ఎదుర్కొన్న ఎస్‌బీఐ బీఎస్‌ఈలో 2.94 శాతం, ఎన్‌ఎస్‌ఈలో 2.54 శాతం చొప్పున లాభాలను ఆర్జించింది. బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ 2.09 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.88 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.81 శాతం, మహీంద్ర అండ్ మహీంద్ర 0.47 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐతోపాటు జీ ఎంటర్‌టైన్‌మెంట్ 3.52 శాతం, టైటాన్ 2.26 శాతం, ఇండియన్‌బుల్స్ 1.86 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా ఉండడం భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీనికితోడు అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చడం కూడా స్టాక్ మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టింది. అనిశ్చితిలో రూపాయి మారకపు విలువ, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సైతం భారత స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశించాయి. మొత్తం మీద ఈ వారం మార్కెట్ నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ మార్కెట్‌లో అనిశ్చితి ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.