బిజినెస్

6 శాతం నష్టపోయిన హెచ్‌సీఎల్ టెక్ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) టెక్నాలజీస్ వాటాలు సుమారు 6శాతం నష్టపోయాయి. ఒక వైపు ఆ కంపెనీ గడచిన మార్చితో ముగిసిన త్రైమాసికానికి తన నికర లాభాల్లో 14.3 శాతం వృద్ధిని నమోదు చేసినా అది స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయలేకపోవడం గమనార్హం. ఉదయం ప్రతికూల పరిస్థితుల నడుమ ఆరంభమైన ఈ వాటాల విలువ తదుపరి కూడా కోలుకోలేదు. దీంతో బీఎస్‌ఈలో ఒక్కో వాటా విలువ రూ. 1,074.45 దిగువన ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో ఈ వాటాలు 5.61 శాతం నష్టపోయి ఒక్కోవాటా రూ. 1,072.80 వంతున ట్రేడైంది. పోటీ కంపెనీలు ఓ వైపు మంచి ఫలితాలతో ముందుకెళుతున్నా హెచ్‌సీఎల్ టెక్ వాటాలు మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో నష్టపోయాయి. ఈ ఐటీ సేవల దిగ్గజం 2019 మార్చి నెలతో ముగిసిన త్రైమాసికానికి 14.3 శాతం ఆధిక్యతతో రూ. 2,550 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10 బిలియన్ డాలర్లు (రూ. 70,258 కోట్లు) వార్షిక ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ కంపెనీ త్రైమాసిక ఆదాయం 21.3 శాతం వృద్ధితో రూ.15,990 కోట్లు ఆర్జించింది. అంతకు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 13,178 కోట్ల ఆదాయం గడించింది. ఇండ్-ఎఎస్ గణాంకాల ప్రాతిపదిక మేరకు మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 16 శాతం పెరిగి రూ. 10,120 కోట్లకు చేరింది. అలాగే వార్షికాదాయం 19.4 శాతం వృద్ధిచెంది మొత్తం రూ. 60,427 కోట్లు (8.6 బిలియన్ డాలర్లు) ఆర్జించింది. నోయిడా ప్రధాన కేంద్రంగా నడిచే ఈ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లభ్యత ఆధారంగా 14 నుంచి 16 శాతం అదనపు ఆదాయం గడించనున్నట్టు అంచనా వేస్తోంది.