బిజినెస్

బేరిష్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: భారత స్టాక్ మార్కెట్‌లో ఈవారం మొత్తం నష్టాల్లోనే ట్రేడింగ్ జరిగింది. బేరిష్ మార్కెట్ కారణంగా, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో సెనె్సక్స్ ఈవారం ఏకంగా 1,500.27 పాయింట్లు పతనమైంది. కేవలం మూడు రోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యమైన గత వారం మార్కెట్ 38,963.26 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం మార్కెట్ కొంత బలపడుతుందనీ, గత వారంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశే్లషకులు అభిప్రాయపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా ఈవారం స్టాక్ మార్కెట్ మొదటి రోజు నుంచి, లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం వరకూ నష్టాల్లోనే కొనసాగింది. తొలి రోజు 362.92 పాయింట్లు నష్టపోయిన సెనె్సక్స్ 38,600.34 పాయింట్లకు పడిపోయింది. ఆతర్వాతి రోజు 323.71 పాయింట్లు పతనమై, 38,276.63 పాయింట్లకు చేరింది. మూడోరోజైన బుధవారం అత్యధికంగా 487.50 పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా ఆ రోజు లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 37,789.13 పాయింట్లుగా నమోదైంది. గురువారం 230.22 పాయింట్లు తగ్గడంతో 37,558.91 పాయింట్లకు చేరింది. ఇక ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం కొద్దిగా కోలుకున్నప్పటికీ, 95.92 పాయింట్లు నష్టపోవడంతో 37,462.99 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్‌ను ఈవారం ఎక్కువగా ప్రభావితం చేసిన అంశాల్లో మొట్టమొదటిగా అమెరికా, చైనా దేశాల మధ్య తీవ్రమవుతున్న వాణిజ్య యుద్ధ వాతావరణాన్ని పేర్కోవాలి. అమెరికా తాజాగా చైనా నుంచి దిగుమతి అవుతున్న పలు వస్తువులపై 153 బిలియన్ డాలర్ల వరకూ అదనపు పన్నులను విధించింది. ఒకవైపు వాణిజ్య చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తూనే మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మొత్తం మీద ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో, దాని ప్రభావం భారత్‌తోపాటు యావత్ ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. ఆసియా స్టాక్ మార్కెట్లు ఈవారాంతంలో కొంత బలపడినప్పటికీ, అమెరికా వల్ల ప్రభావితమైన భారత స్టాక్ మార్కెట్ మాత్రం కోలుకోలేపోయింది.
దీనికితోడు రూపాయి మారకపు విలువ స్థిరంగా లేకపోవడం కూడా అటు బీఎస్‌ఈని, ఇటు జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)ని నష్టాల్లో నడిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం, దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. ఈ కారణంగా కూడా స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగింది. మొత్తం మీద సానుకూల ధోరణులు ఏవీ కనిపించకపోవడంతో, ఇనె్వస్టర్ సెంటిమెంట్ ప్రతికూలంగానే కనిపించింది. సెనె్సక్స్, నిఫ్టీ పతనం వారం మొత్తం కొనసాగింది. వచ్చే వారం ఎంత వరకూ మార్కెట్ కోలుకుంటుందో చూడాలి.