బిజినెస్

ఏపికి ‘సాగరమాల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో 8500 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. విశాఖలో విసిటిపిఎల్‌లో నిర్మించిన కంటైనర్ ఫ్రీట్ స్టోరేజి సౌకర్యాన్ని, విశాఖ పోర్టు ట్రస్టు నిర్మిస్తున్న 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను, విశాఖ పోర్టులోని రెండు బెర్త్‌లను ఆయన గురువారం ప్రారంభించారు. మరో రెండు బెర్త్‌ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టును 12 లక్షల కోట్ల రూపాయలతో చేపడుతోందని, ఇందులో 4 లక్షల కోట్ల రూపాయలను రహదారుల నిర్మాణం వంటి సౌకర్యాల అభివృద్దికి వెచ్చించనున్నట్లు తెలిపారు. మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోని వివిధ పోర్టుల ఆధునీకరణ సహా 27 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ వద్ద కాకినాడ వద్ద 3000 కోట్ల రూపాయలతో ఎల్ అండ్ జి టెర్మినల్‌ను, మిగిలిన నిధులతో విశాఖలో అదనపు ఆయిల్ జెట్టీ, మరో స్టాక్ యార్డు నిర్మాణం, కాకినాడ వద్ద కోస్టల్ ఫుడ్ ఎక్స్‌పోర్టు బెర్త్ ఉన్నాయన్నారు. వాడ్రేవు, మచిలీపట్నం వద్ద కొత్తగా ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో విశాఖ పోర్టు చాల కీలకమైనదని, దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు 2000 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.
బకింగ్ హామ్ కాలువ అభివృద్ధిపై చర్చిస్తా
రాష్ట్రాల మధ్య జల రవాణా వ్యవస్థను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల గంగా నది ద్వారా బంగ్లాదేశ్‌కు కారును రవాణా చేయగా, దాని ధర 5000 రూపాయలు తగ్గిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అంతర్రాష్ట్ర జల రవాణాలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని బకింగ్‌హామ్ కాలువ ఆధునీకరణ చేపట్టనున్నామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శుక్రవారం చర్చించనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో దీని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమన్నారు. దేశంలోని వివిధ పోర్టులు, నౌకాయాన సంస్థల ద్వారా 6000 కోట్ల రూపాయల మేరకు లాభం ఆర్జించామని తెలిపారు.

చిత్రం.. విశాఖ పోర్టు ట్రస్టు నిర్మిస్తున్న సౌర విద్యుత్ ప్లాంట్ గురించి గడ్కరీకి వివరిస్తున్న కృష్ణబాబు