బిజినెస్

అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక యాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: కరెన్సీ నోట్లను అంధులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తున్నది. ప్రస్తుతం ఆర్బీఐ 10, 20, 50, 100, 200, 500, 2,000 విలువగల రూపాయి నోట్లను ముద్రిస్తున్నది. ఒక రూపాయి నోట్లను భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాగా, వివిధ రకాలైన కరెన్సీ నోట్లను గుర్తించడానికి, వాటిలోని ప్రత్యేకతలను అంధులకు తెలియచెప్పే యాప్‌ను అభివృద్ధి చేయాలన్నది ఆర్బీఐ ఉద్దేశం. వంద లేదా అంతకుపైగా ముఖ విలువగల కరెన్సీ నోట్లను ఈ యాప్ ద్వారా అంధులు గుర్తించేందుకు వీలుంటుందని, ఇందుకు అవసరమైన యాప్‌ను అభివృద్ధి చేసి, తమను సంప్రదించాల్సిందిగా ఒక ప్రకటనలో ఆర్బీఐ కోరింది.