బిజినెస్

ఉక్కు లభ్యతపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: విదేశాలకు ఎగుమతి చేసేందుకు దేశంలో ఇంజనీరింగ్ వస్తువులు తయారు చేస్తున్న కంపెనీలకు ఉక్కు లభ్యతపై కమిటీని వేయాలని కేంద్రం నిర్ణయించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడుతుందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ఈ కమిటీ రెండు నెలల్లోగా కేంద్ర ఉక్కు, వాణిజ్య శాఖకు నివేదిక అందచేస్తుందని తెలిపారు. ఉక్కు ఉత్పత్తి, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతి అనే రెండు కీలక అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని వివరించారు. ఎగుమతులకు వీలుగా, డిమాండ్‌కు సరిపడినంత ఉక్కును ఉత్పత్తి చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ కమిటీ ప్రస్తావిస్తుందని సదరు అధికారి పేర్కొన్నారు. ఇలావుంటే, రవాణా, ఉత్పాదక ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఉక్కు ఉత్పత్తి రంగంలోని కంపెనీల యాజమాన్యాలు వాపోతున్నాయి. పరిస్థితి ఇదే విధంగా ఉంటే, స్టీల్ ఉత్పత్తి పెరగకపోగా, దారుణంగా పతనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. కాగా, ఈ అంశాన్ని కూడా కేంద్రం నియమించే కమిటీ పరిశీలిస్తుంది. దేశం నుంచి ఇంజనీరింగ్ ఎగుమతుల విలువ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 78.7 బిలియన్ డాలర్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.36 శాతం పెరిగి, 83.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే, ఎగుమతులు ఇదే రీతిలో పెరగాలంటే, ఆయా రకాల ఇంజనీరింగ్ ఉత్పత్తులకు అవసరమైన ఉక్కు అందుబాటులో ఉండాలి. లేకపోతే, పరిస్థితి తారుమారు కావచ్చు. అందుకే, కేంద్రం ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించింది. సాధ్యమైనంత వరకూ వాటి పరిమాణాన్ని పెంచాలని యోచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే డీజీఎఫ్‌టీ పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయనుంది.