బిజినెస్

ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లపై సార్వత్రిక ఎన్నికల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: వరుసగా ఎనిమిది రోజులపాటు తీవ్ర ఒత్తిడికి గురైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతులు, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్జనలు, స్థూల ఆర్థిక గణాంకాలపై ఆధారపడి కదలాడుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరు, అస్థిరత్వాన్ని కూడా మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాగా గత వారం మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావంతో ఊగిసలాడిన సంగతి తెలిసిందే. ఈ వారం సైతం ఈ ఉద్రిక్తతల ప్రభావం కొనసాగుతుందని, దీంతోబాటే ఎన్నికల ఫలితాలు, త్రైమాసిక గణాంకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశే్లషకులు చెబుతున్నారు. ప్రపంచ అగ్ర వాణిజ్య శక్తుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే ఊగిసలాట ఈ వారం సైతం తప్పకపోవచ్చని అంటున్నారు. ఈవారం ఆరంభంలోనే ద్రవ్యోల్బణ రేటును సైతం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇది మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించే కీలకాశం కానుంది. ఇలావుండగా ఈనెల 19తో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తికానున్న సంగతి తెలిసిందే. 23న ఫలితాలు వెలువడనున్న దృష్ట్యా దేశం మొత్తం దృష్టి ఆవైపు కేంద్రీకృతమై ఉంది. దీంతోబాటే ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న వాణజ్య వార్ ముడిచమురు ధరలను ఏ స్థితిలో నిలుపుతాయో చూడాల్సివుందని మరో విశే్లషకుడు అభిప్రాయపడ్డారు. ఈ వారం వెలువడే కొన్ని ముఖ్యమైన కంపెనీల ఫలితాలతో ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, లుపిన్, బజాజ్ ఆటో, హిండాల్కో వంటి సంస్థల పారిశ్రామిక ఉత్పత్తి స్థితిగతులు, వాటి స్ధానాలు నిర్ధారించబడతాయి. ఇప్పటికే గత వాణిజ్య వారం ముగింపు రోజైన శుక్రవారం ఆఖరి గంటల్లో ఈ కంపెనీలు తమ ఫలితాలను వెలువరించినా అవి సోమవారం వెల్లడి కానున్నాయి. దేశీయ పారిశ్రామికోత్పత్తులకు గత మార్చిలో 0.1 శాతం గుత్త్ధాపత్యం మాత్రం లభ్యమైంది. అంటే సుమారు 21 నెలల కాలంలో ఇదే అత్యంత తక్కువ మొత్తం. ప్రధానంగా తయారీ రంగం నెమ్మదించిన కారణంగా అధికారిక గణాంకాలు సైతం తగ్గాయని విశే్లషకులు భావిస్తున్నారు. వరుసగా ఎనిమిదో రోజు సైతం గత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి నుంచి ఇవే అతి ఎక్కువకాల నష్టాలుగా గణాంకాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను అమెరికా 200 బిలియన్ డాలర్ల మేర పెంచింది. కాగా గత వారం సెనె్సక్స్ గత వారం మొత్తం 1,500.27 పాయింట్లు కోల్పోయి 3.85 శాతం నష్టాలతో 37,462.99 పాయింట్ల దిగువకు చేరింది.