బిజినెస్

థర్మల్ స్టేషన్లలో భారీగా బొగ్గు నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్స రం చివరి మాసమైన మార్చిలో నిల్వ లు రికార్డు స్థాయిలో 3.46 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది మార్చి మాసంలో ఇది 2.13 కోట్ల టన్నులు మాత్రమే. ఆతర్వాత వరుసగా రెండు నెలలు మరింత తగ్గి, 2.06, 1.91 కోట్ల టన్నులుగా నమోదైంది. గత ఏడాది జూన్ మాసంలో కొంత మెరుగు పడి, 2.00 కోట్ల టన్నులకు చేరింది. జూలై లో 2.11 కోట్ల టన్నులుగా ఉంది. కానీ, మళ్లీ పతనం కొనసాగింది. ఆగస్టులో 1.94, సెప్టెంబర్‌లో 1.49, అక్టోబర్‌లో 1.47 కోట్ల టన్నులుగా ఉంది. నవంబర్ నుంచి నిల్వలు పెరగడం మొదలైంది. నవంబర్‌లో 1.78, డిసెంబర్‌లో 2.16, జనవరిలో 2.45 కోట్ల టన్నులకు పెరిగింది. ఫిబ్రవరిలో మరింత మెరుగుపడి, 3.00 కోట్ల టన్నులకు చేరింది. మార్చిలో 3.46 కోట్ల టన్నులతో రికా ర్డు స్థాయికి నిల్వలు చేరాయి. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోథిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, దేశంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల అవసరం పెరుగుతునే ఉంది. విద్యుత్ వినియోగం అధికమవుతున్న కారణంగా, హైడల్ పవర్ ప్లాంట్ల నుంచి వస్తున్న ఉత్పత్తి సరిపోవడం లేదు. దీనితో, బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ విద్యుత్ ప్లాంట్లను కొనసాగించాల్సి వస్తున్నది.