బిజినెస్

ఇండియన్ బ్యాంకుకు రూ.190 కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గడచిన ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెలువరించింది. ఈఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ బ్యాంకు రూ. 189.77 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ప్రధానంగా మొండి రుణాల కారణంగా బ్యాంకు ఈ పరిస్థితికి చేరగా ఆర్థికంగా బలోపేతం కావడానికి కొంత ప్రభుత్వ సాయాన్ని ఈ బ్యాంకు ఆశిస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి 131.98 కోట్ల లాభాలను ఆర్జించిన ఈ బ్యాంకు ప్రస్తుతం నష్టాల్లోకి జారిపోవడం గమనార్హం. కాగా గడచిన మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంకు ఆదాయం అంతకు ముందటి సంవత్సం వచ్చిన రూ. 4,954.21 కోట్ల నుంచి ప్రస్తుతం రూ. 5,537,47 కోట్లకు పెరిగింది. పూర్తి సంవత్సరం పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకుకు రూ. 320 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఐతే 2017-18లో వచ్చిన లాభాలు రూ. 1,262.92 కోట్లతో పోలిస్తే ప్రస్తుత మొత్తం చాలా తక్కువ. అలాగే గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 21,073.50 కోట్ల ఆదాయాన్ని ఈ బ్యాంకు ఆర్జించింది. అంతకు క్రితం ఏడాది రూ. 19,531.91 కోట్ల ఆదాయం ఈ బ్యాంకు ఆర్జించింది. 2018లో ఉన్న నిరర్థక ఆస్తుల శాతం 7.31 నుంచి గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.11 శాతానికి తగ్గిందని ఈ బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గడచిన త్రైమాసికంలో ప్రాదాన్యత కలిగిన రంగాలకు, అత్యవసర ఖర్చులకు గాను రూ. 1,638.83 కోట్లు కేటాయించినట్టు ఇండియన్ బ్యాంకు తెలిపింది. గడచిన ఇదే కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సుమారు రూ. 100 కోట్లు అధికమని తెలిపింది. మొండి రుణ బకాయిలు సైతం రూ. 1,772.03 కోట్ల నుంచి రూ. 1,432.94 కోట్లకు తగ్గినట్టు బ్యాంకు వివరించింది. ఎన్‌సీఎల్‌టీ సెటిల్మెంట్ ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 585.84 కోట్ల రుణాలను రికవరీ చేయడం జరిగిందని బ్యాంకు వివరించింది.