బిజినెస్

ఏప్రిల్‌లో 3.07 శాతం తగ్గిన టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: తక్కువ ధరల ఇంధనం, తయారీ వస్తువులపై గడచిన ఏప్రిల్ నెలలో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 3.07 శాతానికి తగ్గింది. ఓ వైపు ఆహార వస్తువుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ ఇలాద్రవ్యోల్బణం సరళతరం కావడం విశేషం. టోకు ధరల గణాంకాల ప్రాతిపదికపై ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.18 శాతంగా ఉంది. అంతకు ముందు ఫిబ్రవరిలో 2.93 శాతంగా ఉంది. కాగా 2018 ఏప్రిల్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.62 శాతంగా నమోదైంది. కాగా ఆహార వస్తువులతో కూడిన బుట్టలపై మాత్రం 2019 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.37 శాతంగా ఉంది. అంతకు ముందు మార్చి నెలలో ఈ శాతం 5.68గా ఉండగా ఏప్రిల్‌లో గణనీయంగా పెరిగింది. ఆ రెండు నెలల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. 2018 డిసెంబర్ నుంచి గడచిన ఐదు నెలల కాలంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ఈ కాలంలో ఇది (-) 0.42 శాతంగా ఉంది. అదే తరహాలో కూరగాయల ద్రవ్యోల్బణం సైతం (-) 19.29 శాతంగా సాగుతోంది. గడచిన ఏప్రిల్‌లో ఈ ద్రవ్యోల్బణం 40.65 శాతంగా నమోదైంది. అంతకు క్రితం నెలలో ఇది 28.13 శాతంగా ఉండేది. ఆహార వస్తువుల్లో బంగాళాదుంప (ఆలుగడ్డ) ద్రవ్యోల్బణం 17 నుంచి 15 శాతానికి తగ్గింది. అలాగే ఉల్లిగడ్డలు, పండ్లపై ఈ ద్రవ్యోల్బణం (-)3.43 నుంచి (-) 6.68 శాతంగా ఉంది. కాగా ఏప్రిల్‌లో ఇంధనం, విద్యుత్ కేటగిరీల్లో ద్రవ్యోల్బణం 5.41 నుంచి 3.84 శాతానికి తగ్గింది. అలాగే డీజిల్ 7.23 శాతం నుంచి 3.24 శాతానికి, పెట్రోల్ ద్రవ్యోల్బణం 1.78 నుంచి 1.74 శాతానికి తగ్గాయి. ఎల్‌పీజీ ద్రవ్యోల్బణం మాత్రం అత్యధికంగా 0.94 శాతం నుంచి 11.48 శాతానికి పెరగడం గమనార్హం.
సబ్సిడీ రహిత వంట గ్యాస్ ధరలు ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.5 పెరిగింది. ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్ల కోటా ముగిసిన తర్వాత ప్రతి సిలిండర్‌పై నాన్ సబ్సిడీ ధరలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇలావుండగా తయారీ వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం మార్చిలో 2.16 శాతం ఉండగా ఏప్రిల్‌లో 1.72 శాతానికి తగ్గడం వల్ల ధరల్లో కూడా తగ్గుదల నెలకొంది. రిజర్వుబ్యాంకు ద్రవ్య వినిమయ విధానంలో ప్రధానంగా రీటైల్ ద్రవ్యోల్బణం అదుపుచేయడానికి ప్రాధాన్యతనిచ్చి రెపో రేట్లపై 0.25 శాతం పాయింట్ల మేర కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి ద్రవ్య వినిమయ విధాన సమీక్షా సమావేశం జూన్ 6న జరుగనుందని అస్సోచామ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సౌరబ్ సన్యాల్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. ఆర్‌బీఐ లక్ష్యం మేరకు అటు డబ్ల్యుపీఐ, ఇటు రీటైల్ ద్రవ్యోల్బణాలు 4 శాతానికి లోబడి ఉన్నందున మరోదఫా రెపోరేట్ల కోత తదుపరి సమావేశంలో ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.