బిజినెస్

హమ్మయ్య..ఎట్టకేలకు లాభాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఎట్టకేలకు తొమ్మిది రోజుల నష్టాల బాటనుంచి గట్టెక్కాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 227 పాయింట్లు లాభపడగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకింది. ప్రధానంగా పార్మా, బ్యాంకింగ్, విద్యుత్ రంగాలు లాభాలను సంతరించుకున్నాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో రిలయన్స్ హెవీవెయిట్స్ పరిశ్రమలు, ఐటీసీ, ఎస్‌బీఐ ప్రధానంగా స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి దోహదం చేశాయి. సన్ పార్మా 5.87 శాతం లాభాలతో ప్రథమ స్థానంలో నిలువగా, భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్ సుమారు 5.40 శాతం లాభపడ్డాయి. మరోవైపు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్‌లు నష్టపోయాయి. సెషన్ ఆరంభం నుంచే స్వల్ప సానుకూలతో మొదలైన సూచీలు 37,090.82 పాయింట్ల దిగువన ఆరంభమై ఒక దశలో 37,146.58కు ఆ తర్వాత 37,572.70 పాయింట్ల ఎగువకు, ఆ తర్వాత 36,956.10 పాయింట్ల కనిష్టానికి చేరుకుని మళ్లీ కోలుకుని చివరిగా 227.71 పాయింట్ల లాభంతో 37,318.53 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 11,151,65 పాయింట్ల వద్ద ఆరంభమై 11,294.75 పాయింట్ల ఆధిక్యానికి ఎగబకి, మళ్లీ 11,108.30 దిగువకు చేరింది. చివరిగా 73.85 పాయింట్లు లాభపడి 11,222,05 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా వరుసగా గత తొమ్మిది రోజులుగా సెనె్సక్స్ 1,940.73 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ దాదాపు 600 కోల్పోయింది. ఇలావుండగా మంగళవారం తొలి సగం రోజు సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య వివాదం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కూడా మదుపర్లను అయోమయానికి గురిచేశాయని వాణిజ్య నిపుణులు విశే్లషిస్తున్నారు. కాగా రూపాయి విలువ ఎట్టకేలకు మధ్యంతరంగా కోలుకుని 13 పైసలు లాభపడి అమెరికన్ డాలర్‌కు 70.38 రూపాయలుగా ట్రేడైంది. మంగళవారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా వాటాల విక్రయం జరిగింది. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను సుమారు 60 బిలియన్ డాలర్ల మేర పెంచనున్నట్లు ప్రకటించడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.94 శాతం పెరిగి బ్యారెల్ 70.89 డాలర్లు పలికింది. ముడిచమురు ఉత్పత్తి జరిగే మధ్య, తూర్పు దేశాల నుంచి సరఫరా తగ్గడం వల్ల ముడిచమురు ధరలు పెరిగాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.