బిజినెస్

ముడి చమురు సరఫరా నిలిపి వేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్, మే 15: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేయడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం వంటి సంక్షోభాల నేపథ్యంలో ఇరాన్‌కు ముడి చమురు సరఫరా నిలిపి వేసినట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు డిమాండ్ కోసం ఉత్పత్తిని ఒపీఇసీ (ఒపెక్) తగ్గించింది. సౌదీ చమురు క్షేత్రాలు లక్ష్యంగా డ్రోన్ దాడులు జరుగుతున్నందున ముడి చమురు సరఫరాను సౌదీ నిలిపి వేసింది. తూర్పు దశలో ఉన్న చమురు క్షేత్రం నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఉన్న పైపులైన్ల పరిధిలో రెండు పంపింగ్ స్టేషన్లపై దాడి జరిగిందని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖాలీద్ అల్ పాలిహ్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా ముడి చమురు సరఫరా నిలిపి వేశామని ఖాలీద్ చెప్పారు. పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ముడి చమురు సరఫరా చేస్తామని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుగుబాటుదారుల దాడులను ఆయన ఖండించారు. మంగళవారం నాలుగు నౌకలపై దాడులు జరిగినట్లు ఆయన తెలిపారు. సౌదీ చమురు క్షేత్రాలు లక్ష్యంగా డ్రోన్ దాడులు చేశామని యెమెన్ హుధీ తిరుగుబాటులు దారులు ప్రకటించిన వెంటనే సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. సౌదీ అరేబియాను మాత్రమే కాకుండా ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక ఇరాన్ ఉన్నదని మరోసారి స్పష్టమైందని మంత్రి ఖాలీద్ తెలిపారు.

చిత్రం...సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖాలీద్ అల్ పాలిహ్