బిజినెస్

రైల్‌టెల్ కార్పొరేషన్ ఐపీఓ ద్వారా రూ.300 కోట్లు సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: టెలికాం వౌలిక వసతుల కల్పన విభాగం రైల్‌టెల్ కార్పొరేషన్‌ను ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐపీఓ) పరిధిలోకి తీసుకువచ్చి దాదాపు రూ. 300 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి 2018-19 ఆర్థిక సంవత్సర అకౌంట్ పుస్తకాలను శీఘ్రగతిన తుదిరూపానికి తీసుకురావాల్సిందిగా రైల్‌టెల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర కేబినెట్ ఈ ఐపీఓకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ వాటాలను సైతం 25 శాతం వెనక్కు తీసుకోవడం జరిగింది. ఈక్రమంలో వచ్చే సెప్టెంబర్ నాటికి ఐపీఓను అమలు చేయాలన్నది ప్రణాళిక లక్ష్యం. కాగా ప్రభుత్వ రంగ సంస్థ మినిరత్న అతిపెద్ద టెలికాం వౌలిక వసతుల కల్పన విభాగంగా ఉంది. దీనికి ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ ‘రైట్ ఆఫ్ వే’ పేరిట దేశ వ్యాప్త రైల్వే మార్గాల్లో ఉంది. అలాగే బ్రాడ్‌బ్యాండ్, టెలికాం, మల్టీమీడియా నెట్‌వర్క్‌ను సైతం ఈ కంపెనీ కల్పిస్తోంది. ఇలావుండగా కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం) ఇందుకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు, న్యాయ సలహాదార్లతో ఐపీఓను ఏర్పాటు చేయనుందని సంబంధిత అధికారి సోమవారం నాడిక్కడ తెలిపారు. అందుకే రైల్‌టెల్ వచ్చే జూన్‌లోగా ఆడిటింగ్ వంటివి పూర్తిచేసుకుని, రెగులేటరీ విభాగానికి ఆ డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా ఆదేశించినట్టు ఆ అధికారి వివరించారు. ఇలావుండగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) నుంచి 12 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ. 476 కోట్ల మొత్తాన్ని సమీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించడం జరిగింది. కాగా మరో రెండు రైల్ సీపీఎస్‌ఈలైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)ల్లో సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓను ఆవిష్కరించాలని కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ రంగ విభాగాల్లో పెట్టుబడులు (వాటాలను) వెనక్కు తీసుకోవడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 90 వేల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.