బిజినెస్

మళ్లీ నష్టాల్లోకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల్లోకి దిగజారాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 203.65 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సైతం 11.200 పాయింట్ల దిగువకు చేరింది. మార్కెట్ల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విదేశీ మదుపర్లు వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. గడచిన సోమవారం వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కోలుకుని లాభాల్లోకి వచ్చినా ఆ సంబురం కేవలం ఒక్క రోజుకే పరిమితమైంది. బుధవారం రోజంతా తీవ్ర ఊగిసలాటకు గురైన 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఒక దశలో 500 పాయింట్ల ఎగువకు తర్వాత దిగువకు చేరి ఊగిసలాటకు గురైంది. చివరికి 203.65 పాయింట్లు కోల్పోయి 0.55 శాతం నష్టంతో 37,114.88 పాయింట్ల దిగువన స్థిరపడింది. కాగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 65.05 పాయింట్లు కోల్పోయి 0.58 శాతం నష్టంతో 11,157 పాయింట్ల దిగువన స్ధిరపడింది. ఈ సూచీ సైతం ఒక దశలో 11,136.95 పాయింట్ల దిగువకు ఆ తర్వాత 11,266.80 పాయింట్ల ఎగువకు చేరి అనిశ్చితికి గురైంది. సెనె్సక్స్ ప్యాక్‌లో సన్‌పార్మా, టాటా మోటార్స్ అత్యధికంగా సుమారు 8 శాతం మేర నష్టపోయాయి. వీటితోబాటే ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్‌పార్మా, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఆక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, మారుతీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్ సైతం సుమారు 3.66 శాతం నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్ సుమారు 4.11 శాతం లాభాలను సంతరించుకుంది. అలాగే ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ సైతం 1.05 శాతం లాభపడ్డాయి. ఒకవైపు మార్కెట్ల పరిస్థితులు కొంతవరకు లాభదాయకంగా ఉన్నప్పటికీ మదుపర్లు ఆవైపు చొరవచూపలేదు. ప్రధానంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలు, సాధారణ ఎన్నికల ఫలితాలపై దృష్టి నివిపిన మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంబిస్తున్నారని విశే్లషకులు భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు స్థిరంగా వెనక్కు వెళ్లిపోతుండటం సైతం మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేసిందని చెబుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నాడు స్థూలంగా రూ. 2,011.85 కోట్ల విలువైన వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ. 2,242.91 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారని స్టాక్ ఎక్చేంజీల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా చైనాతో వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం అంతర్జాతీయ మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో చైనా, జపాన్, కొరియా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఐతే ఐరోపా స్టాక్ మార్కెట్ సూచీలు మాత్రం సెషన్ ఆరంభంలో స్వల్ప వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. ఇలావుండగా అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి విలువ సైతం బుధవారం 11 పైసలు పెరిగి ఇంట్రాడేలో మొత్తం రూ. 70.33 గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బుధవారం 0.66 శాతం తగ్గి బ్యారెల్ 70.77 డాలర్లు పలికింది.