బిజినెస్

వాహనాల లీజింగ్ సేవల్లోకి హ్యుండాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: వాహనాల లీజింగ్ సేవల్లోకి ప్రవేశిస్తున్నట్టు హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఎల్) గురువారం నాడిక్కడ పేర్కొంది. ఏఎల్‌డీ ఆటోమోటీవ్ ఇండియా కంపెనీ భాగస్వామ్యంతో ఈ సరికొత్త వాణిజ్య సేవలను సాగిస్తామని తెలిపింది. తమ కంపెనీకి చెందిన అ న్ని మోడళ్లపై ఈ లీజింగ్ ఆఫర్‌ను వర్తింపజేస్తున్న ట్టు, దీనిపై ఎలాంటి ముందస్తు, నిర్వహణ ఖర్చులు ఉండవని హెచ్‌ఎంఎల్ తెలిపింది. భారత్‌లో వాహనాల లీజింగ్ వాణిజ్యం శీఘ్రంగా వృద్ధిచెందుతున్న దృష్ట్యా తమ కంపెనీ వాణిజ్యాన్ని ఆ వైపుగా విస్తరిస్తున్నట్టు కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌జే హా చెప్పారు. వినియోగదారుల అవసరాలను గుర్తించి తమ కంపెనీ స్మా ర్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా ‘షేర్డ్ మొబిలిటీ’తో ముందుకు వెళుతోందన్నారు. ఒకవైపు ఏఎల్‌డీ ఆటోమోటివ్స్‌తో భాగస్వామ్యాన్ని నెరుపుతున్నప్పటికీ పూర్తి యాజమాన్య సేవలను వినియోగదారులకు తమ కంపెనీయే అందజేస్తుందని తెలిపారు. ప్రధానంగా వేతన జీవులు, వృత్తి నిపుణులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కార్పొరేట్, ప్రభుత్వ రంగ కంపెనీలపై తమ వాణిజ్య కార్యకలాపాలను కేంద్రీకృతం చేస్తామన్నారు. తొలి దఫాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు ఎస్‌జే హా తెలియజేశారు.