బిజినెస్

ఏషియన్ మార్కెట్లను కుదిపేసిన ట్రంప్ ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌కాంగ్, మే 16: ఆసియా దేశాల మార్కెట్లు గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ప్రధానంగా భద్రతా కారణాలు చూపి అమెరికాలోని సంస్థలు విదేశీ టెలికాం పరికరాలను వాడరాదంటూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధంపై జరుగుతున్న వాణిజ్య చర్చలు సత్ఫలితాలనిస్తాయని మదుపర్లు ఆశిస్తున్నారు. చైనాకు చెందిన హవాయ్ మార్కెట్ నుంచి తయారై దిగుమతి అవుతున్న వస్తువులను దేశ భద్రతా కారణాల దృష్ట్యా వాడరాదంటూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం అధికారికంగా ప్రకటించడం అంతర్జాతీయంగా మార్కెట్లను కుదిపేసింది. అలాగే చైనాకు చెందిన వస్తువులను అమెరికాలో విక్రయించరాదంటూ మరో ఆంక్షను ట్రంప్ ప్రభుత్వం విధించింది. ఇప్పటికే ఈ రెండు ప్రధాన వాణిజ్య శక్తుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఇది ఆజ్యం పోస్తుందని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికే ప్రశ్నార్థకంగా మారడంతో దీన్ని రూపుమాపాలని చర్చలు సాగుతున్న తరుణంలోట్రంప్ ఆంక్షలు మరింతగా మంటలు రేపాయి. ఇలావుండాగా తదుపరి జనరేషన్ 5జీ మొబైల్ నెట్‌వర్క్స్ రూపొందించడంలో చైనా భాగస్వామ్యం లేకుండా తమ దేశంతోబాటు మిత్ర దేశాలు చర్యలు చేపట్టాలని గత కొన్ని నెలలుగాట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. అలా చేయడం వల్ల అమెరికా నుంచి సమాచారాన్ని పంచుకోవడంలో చైనాను నిలువరించవచ్చన్నది అమెరికా భావన. ఈ క్రమంలో గత వారం అమెరికా చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను 200 బిలియన్ డాలర్ల మేర పెంచనున్నట్టు ప్రకటించడం జరిగింది. దీంతో వాణిజ్య వివాదం మరింతగా ముందిరింది. కాగా ఇటీవల అమెరికా వాణిజ్య శాఖ హవాయ్ (చైనా)కు చెందిన కొన్ని కంపెనీల జాబితాను విడుదల చేసింది. వాటి ఉత్పత్తులను అమెరికాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానం, విడిభాగాలను వినియోగించి ప్రభుత్వ లైసెన్స్ తీసుకోకుండానే తయారు చేశారని అందువల్ల వాటిపై నిషేధాన్ని విధిస్తున్నట్టు పేర్కొంది. అది వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీయలేదనే చెప్పాలి. ఇలావుండగా ఉదయం నుంచి ఆసియన్ స్టాక్ మార్కెట్లు ఇలా ఒడిదుడుకులకు గురైనా తర్వాత ఐరోపా దేశాల్లో నెలకొన్న సానుకూల పరిస్థితులతో కొంత కోలుకున్నాయి. ప్రధానంగా మోటారు వాహనాల ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచే నిర్ణయం అమలును ప్రస్తుతానికి అమెరికా పక్కన పెట్టిందని, ఇందుకు సంబంధించి సంబంధిత దేశాల నుంచి ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉందన్న వార్తలతో మదుపర్లు సానుకూలంగా స్పందించారని విశే్లషకులు చెప్పారు. కాగా గురువారం అమెరికా ఖజానా కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ సెనేటర్లతో మాట్లాడుతూ అమెరికాకు చెందిన అధికారులు త్వరలో చైనా(బీజింగ్)కు వెళ్లి వాణిజ్య ఉద్రిక్తతతలను చల్లార్చే విషయంలో చర్చలు కొనసాగిస్తారని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో హాంగ్‌కాంగ్ మార్కెట్లు స్తబ్ధుగా ముగియగా, చైనా టెలికాం పరికరాల తయారీ సంస్థ జెడ్‌టీఈ 6శాతం నష్టపోయింది. అయితే మరో మార్కెట్ సూచీ షాంఘయ్ మాత్రం 0.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే సిడ్నీ (ఆస్ట్రేలియా) సూచీ 0.7 శాతం, సింగపూర్ సూచీ 0.2 వంతున లాభపడ్డాయి. ఇక వెలిగ్టన్, ముంబయి సూచీలు సైతం లాభపడ్డాయి. టోక్యో (జపాన్) సూచీ 0.6 శాతం నష్టపోగా సియోల్, మనీలా ఒక శాతానికి పైగా నష్టపోయాయి. తైపై 0.8 శాతం నష్టపోయింది, బ్యాంక్‌కాక్, జకార్తా సూచీలు కూడా సెషన్ ఆరంభ దశలో నష్టంతోనే సాగాయి. లండన్, ప్యారిస్ సూచీలు 0.3 శాతం వంతున నష్టపోగా, ఫ్రాంక్‌ఫర్ట్ 0.4 శాతం లాభపడింది. ఇక డాలర్ విలువ సైతం ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే తగ్గింది. ప్రస్తుత అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందగించడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముదిరిగన క్రమంలో ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లలో కోత విధించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.