బిజినెస్

అకారణ ఆంక్షలతో హక్కులు హరించిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: అకారణంగా తమపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనాకు చెందిన టెలికాం దిగ్గజం ‘హవాయ్’ గురువారం నాడిక్కడ మండిపడింది. అమెరికన్ కంపెనీలేవీ విదేశీ టెలికాం పరికరాలను వినియోగించరాదన్న ఆంక్షలను ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా జారీచేయడం ద్వారా తమదేశ వాణిజ్య హక్కులను హరించివేస్తున్నారని హవాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. 3అమెరికాలో హవాయ్ వాణిజ్య కార్యకలాపాలు ఆపివేయించినంత మాత్రాన అమెరికా అత్యధిక భద్రత, బలోపేతాలు చేకూరబోవని, ఇది అమెరికాకు మరింత అదనపు ఖర్చుతో కూడుకున్న అంశంగా మారుతుందని పేర్కొంది. ఇలా మా హక్కులు హరించడం ద్వారా మరింతగా న్యాయపరమైన చిక్కులను ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని హవాయ్ తన ప్రకటనలో పేర్కొంది.