బిజినెస్

స్విస్‌లో ఎంత నల్లధనం ఉందో చెప్పలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: దేశంలో, ఇంకా విదేశాల్లో భారతీయుల నల్లధనం ఎంత ఉందో ఎలా చెప్పగలం అని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లో ఎంత నల్లధనం ఉందో, ఇప్పటి వరకు ఎన్ని కేసులో నమోదయ్యాయో చెప్పేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరించింది. పీటీఐ వార్తా సంస్థకు చెందిన ఓ జర్నలిస్టు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలు చేసిన పిటీషన్‌కు కేంద్ర ఆర్థిక శాఖ పైవిధంగా స్పందించింది. నల్లధనం కేసులకు సంబంధించి భారత్- స్విట్జర్లాండ్ దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయని తెలిపింది. ఇది నిరంతర ప్రక్రియ అని వివరించింది. అయితే స్విట్జర్లాండ్ ఇచ్చే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. స్విట్జర్లాండ్‌లో మన దేశానికి చెందిన వారు దాచుకున్న డబ్బు వివరాలు 2018 నుంచి అందుతున్నా బహిర్గతం చేయలేమని తెలిపింది. ఎంత నల్లధనం ఉంది, ఎంత చెలామణిలో ఉందో కూడా వివరించలేమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 2011 సంవత్సరం నుంచి విదేశాల్లోని నల్లధనంపై ఆరా తీస్తున్నామని, అయితే దేశంలోగానీ, బయటగానీ ఎంత ఉందో సమగ్ర సమాచారం లేదని స్పష్టం చేసింది. ఇలాఉండగా స్విస్ తదితర దేశాల్లో నల్లధనం నిల్వలపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి ఆధారాలు ఏమీ ఉండవు. స్విట్జర్లాండ్ తదితర దేశాల్లోని నల్లధనాన్ని భారత్‌కు తీసుకుని వచ్చి, ప్రతి పేదవాడి అకౌంట్‌లో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తామని గత ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడంతో చర్చ జరుగుతున్నది. విపక్షాలు కూడా నల్లధనం తెస్తామన్న హామీ ఏమైందీ? అంటూ ప్రశ్నిస్తున్నాయి.