బిజినెస్

బోయింగ్ విమాన నియంత్రణకు సరికొత్త సాఫ్ట్‌వేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాండింగ్ సమయంలో పైలెట్ నియంత్రణ కోల్పోకుండా ‘ఫ్లైట్ కంట్రోల్’*
737 మాక్స్ విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటి సమస్యలను గుర్తించాం.. భద్రతకు పెద్దపీట వేశాం*
బోయింగ్ చైర్మన్ మొయిలెన్ బర్గ్
వాషింగ్టన్, మే 17: బోయింగ్ విమానాన్ని నియంత్రించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్’ను రూపొందించామని ఆ సంస్థ యాజమాన్యం శుక్రవారం నాడిక్కడ వెల్లడించింది. ప్రత్యేకించి 737 మాక్స్ బోయింగ్ విమానాలపై చేసిన పరీక్షలు ఫలవంతమయ్యాయని తెలిపింది. మొత్తం 207 బోయింగ్ విమానాలపై 360 గంటలపాటు ఈ పూర్తి అప్‌డేట్లతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించడం జరిగిందని తెలిపింది. ఈ బోయింగ్ విమానాలను నేలపైకి దిం చే విషయంలో సమస్యలు తలెత్తడంతో రెండు వి మాన ప్రమాదాలు చోటుచేసుకోవడంతో భారత్‌తో సహా అంతర్జాతీయంగానూ ఈ బోయింగ్ విమానాల నిర్వహణకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గత మార్చి 10న దారుణ ప్రమాదానికి గురవడంతో ఇది అంతకుముందు గతేడాది అక్టోబ ర్ 29 జరిగిన లయన్ ఎయిర్ లైన్స్ ప్రమాదాన్ని పోలి ఉందని దర్యాప్తులో తేలింది. ఈ రెండు ప్రమాదాల్లో సుమారు 346 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో 737 మాక్స్ 8, 9 బోయింగ్ విమానాల నిర్వహణను నిలిపివేయడం జరిగింది. కాగా కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ‘ఆటోమేటెడ్ మాన్యువరింగ్ క్యారెక్టరిస్టిక్ ఆగ్మెంటేషన్ సిస్టం’ (ఎంసీఏఎస్) విమాన ముక్కు భాగాన్ని విమానం దిగే సమయంలో ఆటోమేటిక్‌గా ముందుకు నెడుతుందని, ఒక వేళ పైలెట్ విమాన నియంత్రణ కోల్పోయినా ప్రమాదం తలెత్తకుండా ఈ ప్రత్యేక సిస్టం పరిరక్షిస్తుందని బోయిం గ్ యాజమాన్యం వివరించింది. ప్రత్యేకించి ఈ విషయంలో భద్రతకు ప్రాధాన్యతనిచ్చామని, ఈ దిశలో అన్ని ఇంజనీరింగ్ టెస్ట్ ఫ్లైట్‌లపై పరీక్షలు పూర్తి చేశామని, ప్రస్తుతం ఫైనల్ సర్ట్ఫికేషన్ కోసం సంసిద్ధం అవుతున్నామని బోయింగ్ చైర్మన్, అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ ముయిలెన్‌బర్గ్ పేర్కొన్నారు. సిస్టం అప్‌డేట్ కారణంగా విమానం ముందుభాగం తప్పుడు యాంగిల్‌లోకి మారదని, అందువల్ల సెన్సార్ రీడింగ్స్ కూడా దెబ్బతినే అవకాశం లేకుండా ఎంసీఏఎస్ సిస్టం నియంత్రిస్తుందని ఆయన వివరించారు.