బిజినెస్

స్టాక్ మార్కెట్ సూచీల దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం దూకుడును ప్రదర్శించాయి. ఈ ర్యాలీలో బ్యాంకింగ్, వాహన స్టాక్స్ లాభాల పంట పండించాయి. ఓవైపు సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి, మరోవైపు అంతర్జాతీయంగా అననుకూలతలు ఉన్నా అవేవీ సూచీల పరుగుకు కళ్లెం వేయలేదు. బీఎస్‌ఈలో సెనె్సక్స్ ఏకంగా 537.29 పాయింట్లు ఎగబాకగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం మళ్లీ 11,400 స్థాయికి చేరింది. 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 1.44 శాతం ఆధిక్యతతో 537.29 పాయింట్లు లాభపడి 37,930.77 పాయింట్ల ఎగువన స్ధిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 38,001.13 పాయింట్ల ఆధిక్యానికి మరో దశలో 37,415.36 పాయింట్ల దిగువకు చేరి ఊగిసలాటకు గురైంది. ఇక నిఫ్టీ సైతం 150.05 పాయింట్ల లాభంతో 1.33 శాతం ఆధిక్యతతో 11,426.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ సైతం ఒక దశలో 11,326.15 పాయింట్ల కనిష్టానికి, మరో దశలో 11,259.85 పాయింట్ల ఆధిక్యానికి చేరడం విశేషం. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో అత్యధికంగా 6.09 శాతం లాభపడ్డాయి. ఈ సంస్థల త్రైమాసిక లాభాలు కూడా గణనీయంగా ఉండటం స్టాక్ మార్కెట్లలో సత్ఫలితాన్నిచ్చింది. అలాగే హీరోమోటోకార్ప్, మారుతీ, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్ సైతం అధిక లాభాలను ఆర్జించాయి. ఈ కంపెనీలు సుమారు 4.26 శాతం లానపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా మరోవైపు ఎస్ బ్యాంక్, వేదాంత, ఇన్పోసిస్, హెచ్‌సీఎల్ టెక్, సన్ పార్మా, టీసీఎస్, ఎన్‌పీటీసీ 2.36 శాతం నష్టపోయాయి. బ్యాంకింగ్, వాహన రంగాల్లో ఇనె్వస్టర్లు పెద్దమొత్తాల్లో వాటాలు కొనుగొలు చేశారు. దీంతో వచ్చే ఆదివారం రానున్న ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌కు ముందు ఇవి కీలక ఫలితాలుగా మారాయి. బీఎస్‌ఈలో మిడ్‌కాప్, స్మాల్ కాప్ సూచీలు సానుకూలంగానే ముగిశాయి.
తగ్గిన రూపాయి విలువ
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముదిరిన క్రమంలో చైనా, కొరి యా స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలను చవిచూశా యి. ఐరోపా దేశాల సూచీలూ నష్టాల బాటపట్టాయి. ఈ క్రమంలో భార త రూపాయి విలువ శుక్రవారం డాలర్‌పై 16 పైసలు నష్టపోయి రూ. 70.20 గా ట్రైడైంది. జపాన్ స్టాక్ మార్కెట్లు మాత్రం సానుకూలంగా లాభాల్లో ముగిశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.26 శాతం పెరిగి బ్యారెల్ ధర 72.81 డాలర్లు పలికింది.