బిజినెస్

సెబీ-సహారా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: సహారాకు చెందిన పలు ఆస్తులను అమ్మేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు భారీగా నిధులను సమీకరించాయన్న కేసులో గత రెండేళ్ల నుంచి సహారా అధినేత సుబ్రతా రాయ్ జైళ్లో ఉంటున్నది తెలిసిందే. ఈ క్రమంలో సుబ్రతా రాయ్ బెయిల్‌కు కావాల్సిన నగదు డిపాజిట్ కోసం ఆ సంస్థ ప్రకటించిన ఆస్తులను అమ్మే ప్రక్రియను ఆరంభించాలని సెబీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సమీకరించిన నిధులను తిరిగి మదుపరులకు వడ్డీతోసహా చెల్లించాలని సెబీ చెప్పడంతో దాన్ని సహారా వ్యతిరేకించింది. దీంతో వ్యవహారం కోర్టులకు చేరగా, ఆ తర్వాత సెబీ అధీనంలోకి 87 సహారా ఆస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని మార్కెట్ ధరలో 90 శాతానికి తగ్గకుండా విక్రయించాలని సెబీకి చీఫ్ జస్టీస్ టిఎస్ థాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ 90 శాతం దిగువకు అమ్మాల్సి వస్తే కోర్టును సంప్రదించాలని చెప్పింది. సుబ్రతా రాయ్ బెయిల్‌కు 5,000 కోట్ల రూపాయల నగదు, మరో 5,000 కోట్ల రూపాయల బ్యాంక్ పూచీకత్తును డిపాజిట్ చేయాలని సుప్రీం గతంలో సూచించినది తెలిసిందే. అయితే దేశ, విదేశాల్లో ఇందుకు ప్రయత్నించి విఫలమైంది సహారా. ఈ నేపథ్యంలో తాజా సూచన సుప్రీం నుంచి వచ్చింది.
మరోవైపు విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్) రీస్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్స్ కేసులో సెబీ తాజా ఆదేశాలను జారీ చేయనుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్) మంగళవారం సెబీకి సూచనలు చేసింది.