బిజినెస్

డిప్యూటీ.. గవర్నరయ్యారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 24వ గవర్నర్‌గా ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ శనివారం నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలానికిగాను సెప్టెంబర్ 4న పటేల్ బాధ్యతలు స్వీకరించనుండగా, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులు, బ్రెగ్జిట్ ప్రభావం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల సమస్యకు పరిష్కారం ఇప్పుడు ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌పైనే ఆధారపడి ఉంది. పటేల్ హయాంలోనే బాసెల్-3 నిబంధనలు అమల్లోకి రానుండటంతో బ్యాంకుల మూలధన సమస్యపైనా ఆలోచించాల్సి ఉంది. ద్రవ్యోల్బణం అదుపు కోసం వృద్ధిరేటును ఫణంగా పెట్టారన్న ఆరోపణలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో విభేదాల మధ్య ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్.. వచ్చే నెల (సెప్టెంబర్) 4న పదవిని వీడుతున్నది తెలిసిందే. గడచిన రెండు దశాబ్దాల కాలంలో కేవలం మూడేళ్లే ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నది ఒక్క రాజన్ మాత్రమే. 2013 సెప్టెంబర్‌లో ఆర్‌బిఐ పగ్గాలు అందుకున్న రాజన్.. తమ సిబ్బందికి లేఖ రాసి తన రాజీనామా విషయాన్ని బయటపెట్టారు. తిరిగి తాను అధ్యాపక వృత్తిలోకే వెళ్తానని ప్రకటించారు. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఆర్‌బిఐ గవర్నర్ పదవి రాజకీయాల్లోకి రాగా, రాజన్ రాజీనామాను కేంద్రం వెంటనే ఆమోదించింది. కొత్త గవర్నర్ కోసం చాలామందినే పరిశీలించగా, చివరకు ఆ అవకాశం పటేల్‌కే వచ్చింది. డిప్యూటీ గవర్నర్‌గా, రేసులో పిన్న వయస్కుడిగా పటేల్‌కే కేంద్రం మొగ్గు చూపింది. 1990-95 మధ్య అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్)లో పనిచేసిన పటేల్.. బ్యాంకింగ్ సంస్కరణలు, పెన్షన్ సంస్కరణలు, విదేశీ కరెన్సీ మారకద్రవ్యం విధానాల్లో కీలక భూమిక పోషించారు. మరోవైపు ఆర్‌బిఐ నూతన గవర్నర్ ఉర్జిత్ పటేల్ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడగలరన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా నూతన గవర్నర్‌కు శుభాకాంక్షలు అందజేశారు. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్ కూడా కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికారు.

చిత్రం.. ప్రస్తుత ఆర్‌బిఐ గవర్నర్ రాజన్‌తో ఆర్‌బిఐ 24వ గవర్నర్ ఉర్జిత్ పటేల్ (ఎడమ నుంచి తొలి వ్యక్తి)